CM Siddaramaiah : కర్ణాటక సీఎం ప్రజా దర్బార్
విజ్ఞాపనలు స్వీకరించిన సిద్దరామయ్య
CM Siddaramaiah : తాను సీఎంను కానని ప్రజల మనిషినని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Siddramaiah). గురువారం ఎప్పటి లాగే తన నివాసం వద్ద వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గతంలో సీఎంగా పని చేసిన సమయంలో సైతం సిద్దరామయ్య ఇదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ సమస్యలతో విజ్ఞాపనలు అందజేశారు సీఎంకు. సిద్దరామయ్య(Siddaramaiah) ఇటీవల కర్ణాటక సీఎంగా కొలువు తీరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఉన్నారు. ఇద్దరూ సారథులుగా సక్సెస్ అయ్యారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 సీట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. కేపీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ సారథ్యం వహించారు. ఇక బీజేపీకి 65 సీట్లు రాగా జేడీఎస్ 19 సీట్లకే పరిమితమైంది. ఇక గెలుపొందిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు మూకుమ్మడిగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 139కి చేరింది.
ఇదిలా ఉండగా సీఎం సిద్దరామయ్య తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సైతం పక్కన పెట్టి ప్రజలతో కలిసి పోయేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సీఎం తీసుకున్న ఈ నిర్ణయానికి జనం ఫిదా అవుతున్నారు. తాను సీఎంగా బిజీగా ఉండవచ్చు. కానీ ప్రజలే తనకు ముఖ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సిద్దరామయ్య.
Also Read : RS Praveen Kumar : రైతులకు శాపం ధరణి దారుణం