CM Siddaramaiah : సిద్ద‌రామ‌య్య బ‌క్రీద్ గ్రీటింగ్స్

సామూహిక ప్రార్థ‌న‌ల్లో సీఎం

CM Siddaramaiah : బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య ముస్లిం సోద‌ర‌, సోద‌ర‌ణీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్రంలోని చామ‌రాజ్ పేట లోని ఈద్గా మైదాన్ లో భారీగా ముస్లిం సోద‌రులు చేరుకున్నారు. అంతా క‌లిసి సామూహిక ప్రార్థ‌న‌లో పాల్గొన్నారు. త‌ర‌లి వ‌చ్చిన ముస్లింల‌కు గ్రీటింగ్స్ తెలిపారు. సీఎం సిద్ద‌రామ‌య్య‌తో పాటు హౌసింగ్ శాఖ మంత్రి కూడా పాల్గొన్నారు. పేరు పేరునా ప‌ల‌క‌రించారు. మ‌రో వైపు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ బ‌క్రీద్ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని గ్రీటింగ్స్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా జూన్ 29న బ‌క్రీద్ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఇదే రోజు ఆషాఢ ఏకాద‌శి ప‌ర్వ‌దినం వ‌చ్చింది. ఏకాద‌శితో పాటు బ‌క్రీద్ సంద‌ర్భంగా హిందువులు, ముస్లింల‌కు విషెస్ తెలిపారు క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌(CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్.

కాగా క‌ర్ణాట‌క‌లో పెద్ద ఎత్తున ముస్లిం క‌మ్యూనిటీ కొలువు తీరి ఉంది. ఇవాళ ప్ర‌త్యేకించి పెద్ద ఎత్తున ముస్లిం సోద‌రులు ఈద్గా వ‌ద్ద‌కు చేరుకున్నారు. బ‌క్రీద్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

Also Read : MK Stalin Mari Selvaraj : మారి సెల్వ‌రాజ్ కు స్టాలిన్ కితాబు

Leave A Reply

Your Email Id will not be published!