YS Jagan : తిరుపతి సమీపంలోని భాకారాపేట వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan )తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పెళ్లి బృందానికి చెందిన పలువురు మృతి చెందడం బాధాకరమని సీఎం పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల సహాయం అందించాలని, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు జగన్ రెడ్డి.
అంతే కాకుండా బాధితులు కోలుకునేంత దాకా క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన సహాయ కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం(YS Jagan ).
మెరుగైన వైద్య చికిత్స తో పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను , సహాయక చర్యల గురించి అధికారులు సీఎం కు విన్నవించారు.
ఇదిలా ఉండగా ప్రమాద ఘటన జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు అందేలా చూస్తున్నారని ఉన్నతాధికారులు జగన్ రెడ్డికి తెలిపారు.
కాగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. క్షతగాత్రుల్ని తిరుపతిలోని స్విమ్స్ , రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారని తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో ఉన్నారని వివరించారు.
Also Read : ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు