CM YS Jagan Mohan Reddy: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు !

విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు !

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) విశాఖలోని చినముషిడివాడలో గల శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానంద సరస్వతితో కలిసి శారదా పీఠంలో రాజశ్యామల యాగం, పూర్ణాహుతి, మన్యుసుక్త హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే శారదా పీఠం ఆవరణలో గల శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని… రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు గంట పాటు పీఠంలోని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

CM YS Jagan Mohan Reddy Visit

గత ఎన్నికలకు ముందు విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన తెలంగాణా సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్… రాజ శ్యామల యాగం నిర్వహించారు. శారదా పీఠంలో రాజశ్యామలా యాగం నిర్వహించిన తరువాత ఇద్దరూ కూడా సీఎంలు కావడంతో… ఎన్నికల ముందు శారదా పీఠంలో ఉన్న రాజ శ్యామల అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్ గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇది ఇలా ఉండగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి విజయవాడలో మూడు రోజుల పాటు రాజ శ్యామల యాగం నిర్వహించారు. సుమారు 50 మంది రుత్వికులతో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ యాగంలో చంద్రబాబు సతీ సమేతంగా పాల్గొన్నారు.

Also Read : TSRTC MD Sajjanar : మేడారం జాతరకు వెళ్లే బస్సులపై ఏ విధమైన అదనపు చార్జీలు లేవు

Leave A Reply

Your Email Id will not be published!