CM YS Jagan: ట్రెండింగ్‌లో ‘రిజైన్ జగన్’ హ్యాష్‌ట్యాగ్ !
ట్రెండింగ్‌లో ‘రిజైన్ జగన్’ హ్యాష్‌ట్యాగ్ !
CM YS Jagan: ఏపీలో రాజకీయాలన్ని పెన్షన్ల చుట్టూ తిరుగుతున్నాయి. వాలంటీర్ల నియామకాలపై గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో… ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ప్రతీ నెల 1వ తేదీన వాలంటీర్లు ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్లను… సచివాలయం సిబ్బందితో ఇప్పించాల్సి వచ్చింది.
CM YS Jagan Resign # Tag Viral
అయితే వాలంటీర్లు అయితే ఉదయం ఆరుగంటలకే… లబ్ది దారుల ఇంటికి వెళ్ళి ఇచ్చేవారని… టీడీపీ నేతల ఫిర్యాదుతో వృద్ధులు, వికలాంగులు మండుటెండలో సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకోవడం జరుగుతందంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పెన్షన్ల పంపిణీ నిలిచిపోవడానికి, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు కారణమంటూ వైసీపీ నాయకులు అనుబంధ మీడియా కోడై కూస్తుంది.
అయితే ఈసీ ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇప్పించడంతో రాష్ట్రలో పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. దీనితో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు రావు అనే వైసీపీ నాయకుల ప్రచారాన్ని టీడీపీ దాని అనుబంధ మీడియా బలంగా తిప్పికొట్టింది. రాష్ట్రంలో కొన్ని చోట్లు వైసీపీ నాయకులు చేసిన శవ రాజకీయాలను మీడియా, సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపించారు. దీనితో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘ఎక్స్’లో రిజైన్ జగన్(CM YS Jagan) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నెటిజన్ల ట్వీట్లతో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిసేలా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనం కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేయాలనే సామాజిక బాధ్యత విస్మరించిన జగన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ వందలాది మంది ట్వీట్లు చేస్తున్నారు. ఏపీలో అవ్వాతాతలకు మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Also Read : IPL 2024 SRH vs CSK : టాస్ గెలిచిన సన్ రైజర్స్…బ్యాట్టింగ్ వారే