CMs VS Governors Comment : సీఎంలు వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్లు

రాజ్యాంగ అధిప‌తులా కీలు బొమ్మ‌లా

CMs VS Governors Comment : మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చింది గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌. భార‌త రాజ్యాంగాన్ని రాసిన డాక్ట‌ర్ భీమ్ రావ్ అంబేద్క‌ర్ ముందు చూపుతో రాజ్యాంగాన్ని ప‌రిరక్షించేందుకు రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌స్తావించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు కూడా ఉన్నాయి.

కేంద్రంలో కొలువు తీరిన స‌ర్కార్ కు ఆయా రాష్ట్రాల‌లో నెల‌కొన్న ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ప్ర‌ధానంగా దేశంలో న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా

కొలువు తీరిన నాటి నుంచి ఈ పంచాయ‌తీ మొద‌లైంది.

ప్ర‌ధానంగా తెలంగాణ‌లో సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ , త‌మిళ‌నాడులో సీఎం స్టాలిన్ , గ‌వ‌ర్న‌ర్ జీఎన్ ర‌వి, కేర‌ళలో సీఎం 

పిన‌ర‌య్ విజ‌య‌న్ , గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు(CMs VS Governors) కొన‌సాగుతోంది. మొద‌ట్లో బాగానే ఉన్నా రాను రాను నువ్వా నేనా అనేంత స్థాయికి వెళ్లింది.

ప్ర‌ధానంగా దక్షిణాన కీల‌క‌మైన రాష్ట్రాల‌లో ఈ మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. బిల్లులు ఆమోదం పొందాలంటే గ‌వ‌ర్న‌ర్ సంత‌కం త‌ప్ప‌నిస‌రి. చివ‌ర‌కు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు కూడా దిగుతుండ‌డం విస్తు పోయేలా చేస్తోంది. ఇదే స‌మ‌యంలో కేర‌ళ‌లో చోటు చేసుకున్న వ్య‌వ‌హారం తారా స్థాయికి చేరుకుంది.

ఇక్క‌డ 9 మంది వీసీల‌ను రాజీనామా చేయాల‌ని కోర‌డం ఆగ్ర‌హాన్ని తెప్పించింది. దీనిని స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు. ఇదే స‌మ‌యంలో రెండు

న్యూస్ ఛాన‌ళ్ల‌ను నిషేధించారు గ‌వ‌ర్న‌ర్ ఖాన్. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ జ‌ర్న‌లిస్టులు ధ‌ర్నా చేప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ త‌న ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు సీఎం.

ప్ర‌స్తుతం కేర‌ళ‌, త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్లు, అధికార పార్టీల మ‌ధ్య పోరు కొన‌సాగుతోంది. గ‌వ‌ర్న‌ర్లు కేంద్రం క‌నుస‌న్న‌ల‌లో

కీలుబొమ్మ‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు. మ‌రో వైపు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సైతం వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు.

ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్సీల నియామ‌కం, యూనివ‌ర్శిటీలలో ఖాళీల భ‌ర్తీ జాప్యంపై ఆరా తీయ‌డాన్ని ప్ర‌భుత్వం త‌ప్పు ప‌డుతోంది. సీఎం కేసీఆర్

గ‌వ‌ర్న‌ర్ పై భ‌గ్గుమ‌న్నారు. తెలంగాణ‌లో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు చేయ‌కూడ‌దంటూ హెచ్చ‌రించారు. ఈ ఇద్ద‌రి పంచాయ‌తీ కేంద్రానికి పాకింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు చేయ‌వ‌ద్ద‌ని ఇది ఆమె ప‌ని కాద‌ని సూచించారు గ‌వ‌ర్న‌ర్ ర‌వి. త‌మిళి సై చ‌ట్ట 

ప‌ర‌మైన ప్ర‌మాణాల‌కు లోబ‌డి ప‌ని చేయాల‌ని ముర‌సోలి పేర్కొన్నారు. మ‌రో వైపు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్నారంటూ ఆయ‌న‌ను బ‌దిలీ చేయాల‌ని కోరుతున్నారు సీఎం స్టాలిన్.

ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి అన‌ర్హుడ‌ని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున డీఎంకే ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు కూడా చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా

త‌మిళ‌నాడులో 20 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

మ‌రో వైపు తెలంగాణ స‌ర్కార్ ప్రోటోకాల్ కూడా పాటించ‌డం లేద‌ని, త‌న డ‌బ్బుల‌తోనే తాను ఇక్క‌డ ఉంటున్నాన‌ని అన్నారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై. మొత్తంగా కేర‌ళ‌లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. చివ‌ర‌కు దక్షిణాదిన సీఎంలు వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగడం ప్ర‌భుత్వాల ప‌నితీరు పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది.

Also Read : ఫోర్బ్స్ టాప్ 20 మ‌హిళ‌ల్లో మ‌నోళ్లు

Leave A Reply

Your Email Id will not be published!