Virat Kohli : ఐసీసీ మహిళా వరల్డ్ కప్ -2022 ప్రారంభమైంది. భారత జట్టు ఈనెల 6న తమ మొదటి మ్యాచ్ ను దాయాది ప్రత్యర్థి పాకిస్తాన్ మహిళా జట్టుతో తలపడనుంది.
ఈ తరుణంలో భారత క్రికెట్ జట్టు స్కిప్పర్, హైదరాబాద్ స్టార్ ప్లేయర్ మిథాలీరాజ్ సేనకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)సపోర్ట్ గా నిలిచాడు. వరల్డ్ కప్ తో తిరిగి రావాలని పిలుపునిచ్చాడు.
అంతే కాదు యావత్ భారతీయ క్రీడాభిమానులంతా ముక్త కంఠంతో మన మహిళా జట్టు ప్రపంచ కప్ తో రావాలని కోరాలని సూచించాడు. సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియ చేశాడు విరాట్ కోహ్లీ.
ఇదిలా ఉండగా ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది.
దీంతో ప్రస్తుతం మహిళా టీంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. కాగా 2017లో జరిగిన మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టు రన్నరప్ గా నిలిచింది. ఈసారి ఎలాగైనా సరే కప్ తో రావాలని పట్టుదలతో ఉంది.
సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించిన ప్రస్తుత కెప్టెన్ మిథాలీ రాజ్ వరల్డ్ కప్ ముగిశాక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో గొప్ప అవకాశం వచ్చిందన్నారు.
ఈ తరుణంలో భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలపండి. ప్రార్థనలు చేయండి. మన మహిళా జట్టు విజయం సాధించాలని కోరాలని విరాట్ కోహ్లీ సూచించాడు.