Raju Srivastav : కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకున్న విషాదం
Raju Srivastav : ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(Raju Srivastav) కన్నుమూశారు. ఆయనకు 58 ఏళ్లు. జిమ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా రాజు శ్రీవాస్తవ కు గుండె పోటుకు గురయ్యారు. ఆయను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
నెల రోజుల తర్వాత ఢిల్లీలో బుధవారం మరణించారు. జిమ్ లో ఉన్నట్టుండి కుప్ప కూలారు. గత నెల ఆగస్టు 10న చికిత్స నిమిత్తం ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) కు తరలించారు.
అదే రోజు యాంజియోప్లాస్టీ చేసి వెంటిలేటర్ పై పెట్టారు. రాజు శ్రీవాస్తవ(Raju Srivastav) 1980 నుండి వినోద పరిశ్రమలో చురుకుగా ఉన్నారు. కాగా 2005లో స్టాండ్ అప్ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ లాస్టర్ ఛాలెంజ్ లో పాల్గొన్న తర్వాత దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు.
మైనే ప్యార్ కియా, బాజీగర్ , బాంబే టు గోవా, ఆమ్దానీ అత్తానీ ఖర్చ రూపయ్య వంటి హిందీ చిత్రాలలో కనిపించాడు. బిగ్ బాస్ సీజన్ -3 పోటీదారులలో రాజు శ్రీవాస్తవ ఒకడిగా ఉన్నాడు.
కాగా శ్రీవాస్తవ మరణించేంత వరకు ఉత్తర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా పని చేశారు. లక్షలాది మందిని తన ప్రతిభతో నవ్వించేందుకు ప్రయత్నం చేశాడు.
ఇవాళ ఉదయం 10.20 గంటలకు ప్రాణాలు విడిచారని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. గత 40 రోజుల నుంచి ఆయన పోరాడుతూ వచ్చారు.
చివరకు లేక పోవడం బాధాకరమని సినీ లోకం పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : తమిళ నటి పౌలిన్ జెస్సికా ఆత్మహత్య