Sourav Ganguly : భారతీయ క్రికెట్ నియంత్ర మండలి – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దాదా మధ్య విభేదలు ఉన్నాయంటూ లకమంతా కోడై కూస్తోంది.
సౌతాఫ్రికా టూర్ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న అంతరం మరింత పెరిగింది. దీంతో ప్రపంచ మీడియా సైతం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు గురించి జోరుగా ప్రచారం చేశాయి. డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాయి.
ఈ తరుణంలో ఓ మ్యారేజ్ వేడుకలకు హాజరైన బీసీసీఐ చీఫ్ గంగూలీని మీడియా చుట్టుముట్టింది. నీకు కోహ్లీకి మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనా అని అడిగిన ప్రశ్నకు భిన్నంగా సమాధానం చెప్పాడు గంగూలీ.
ఈనెల 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కు విరాట్ కోహ్లీ కెరీర్ లో 100వ టెస్టు ఆడబోతున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలా అరుదైన ఫీట్ సాధించేందుకు కొన్ని గంటల దూరం మాత్రమే ఉంది.
తనకు కోహ్లీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు గంగూలీ. ఇదే సమయంలో కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు దాదా. వంద టెస్టులు ఆడటం అన్నది చాలా కష్టతరమని పేర్కొన్నాడు.
భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఫీట్ సాధించిన వాళ్లు అతి కొద్ది మాత్రమే ఉన్నారని గుర్తు చేశాడు గంగూలీ(Sourav Ganguly ). ఇదే సమయంలో కోహ్లీ అద్భుతమైన ఆటగాడని కితాబు ఇచ్చాడు.
అంతే కాదు కోహ్లీ 100వ టెస్టులో 100వ సెంచరీ సాధిస్తాడని ఆ నమ్మకం తనకు ఉందన్నాడు. గతంలో తాను, రాహుల్ ద్రవిడ్ సైతం ఫామ్ లేమితో కొట్టు మిట్టాడమని ఆ తర్వాత పుంజుకున్నామని తెలిపాడు.
Also Read : వార్నర్ భయ్యా మామూలు లేదుగా