Congress 2024 Comment : కాంగ్రెస్ ఫోకస్ కానుందా సక్సెస్
రణ భేరి విజయ భేరి అవుతుందా
Congress 2024 Comment : ఒకప్పుడు ఇండియా అంటే కాంగ్రెస్ . కాంగ్రెస్ అంటే ఇండియా అన్నంతగా పేరు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. 139 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం స్ట్రాటజీని మార్చింది. ఒంటరిగా ఈ దేశంలో గెలవలేమని నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు ఏఐసీసీని తమ భుజాల మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మోసినా ఉన్న చోటనే ఉండి పోయింది. చివరకు ఇటీవల పార్టీకి ఎన్నికలు నిర్వహించింది ఏఐసీసీ. మల్లి కార్జున్ ఖర్గే చీఫ్ గా ఎన్నికైనా మొత్తం నడిపేదంతా సోనియా గాంధీనేనని జోరుగా ప్రచారం కూడా ఉంది. ఇదే విషయాన్ని బీజేపీ కూడా ఎత్తి పోస్తూ వస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఖర్గే వచ్చాక కొంత మార్పు వచ్చింది. పార్టీలో కదలికలు వచ్చాయి. ఉన్నట్టుండి రెండు రాష్ట్రాలలో హస్తం జెండా ఎగిరింది.
Congress 2024 Comment Viral
హిమాచల్ ప్రదేశ్ తో పాటు కర్ణాటకలో కాంగ్రెస్(Congress) గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ప్రజలకు ముందస్తు హామీలను ఇస్తూ ముందుకు సాగింది. ఇవే పార్టీని గట్టెక్కించేలా చేశాయి. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్ వేదికగా నిర్వహించింది. త్వరలో 2024లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా వాటి మీదే ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణపై ఎక్కువగా దృష్టి సారించింది. దీనికి ప్రధాన కారణం తమ పార్టీ తెలంగాణను ఇచ్చినా ఎందుకని ఇక్కడ పాగా వేయలేక పోయామన్న పునరాలోచనలో పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు అధికార పార్టీకి ఉన్నాయని, దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇక్కడ అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతోంది. ఇదే సమయంలో ఈసారి ఆక్టోపస్ లా దేశమంతటా విస్తరిస్తూ వచ్చిన మోదీ బీజేపీకి బిగ్ షాక్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగా ముందుగా చెప్పు కోవాల్సింది బీహార్ సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను. దేశంలోని 28 పార్టీలను, నేతలను ఒకే వేదికపైకి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. దీనికి విపక్షాల కూటమి ఇండియాగా పేరు పెట్టారు. ఈ పేరు సంచలనంగా మారింది. మరో వైపు ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావాలని ముచ్చట పడుతున్నారు నరేంద్ర మోదీ. ఆయన హవాను అడ్డుకునేందుకు ఇండియా ఏ మేరకు ప్రయత్నం చేస్తుందో వేచి చూడాలి. ఇది పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. త్వరలో రాజస్థాన్ , మధ్య ప్రదేశ్ , తెలంగాణ, ఛత్తీస్ గఢ్ , తదితర రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ పవర్ లో ఉంది. వీటిని తిరిగి కాపాడు కోవడంతో పాటు ఇతర రాష్ట్రాలలో పవర్ లోకి వచ్చేలా చేయడం. వీటిపై పట్టు సాధిస్తూనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. మరి కాంగ్రెస్ ఫోకస్ సక్సెస్ సాధిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
Also Read : Suman Bose : స్కిల్ స్కామ్ జరగలేదు – సుమన్ బోస్