Ankitha Dutta : అంకితా దత్తాపై కాంగ్రెస్ నిషేధం
ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరణ
Ankitha Dutta : జాతీయ యూత్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బీవీ శ్రీనివాస్ పై శారీరిక, మానసిక వేధింపులకు గురైనట్లు సంచలన ఆరోపణలు చేసిన అస్సాం యూత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అంకితా దత్తాపై(Ankitha Dutta) వేటు పడింది. ఈ మేరకు శనివారం అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) కీలక ప్రకటన చేసింది. పార్టీ నుంచి అంకితా గుప్తాను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఆరేళ్ల పాటు ఆమెపై వేటు వేసినట్లు వెల్లడించింది.
ఆమె నిరాధారమైన ఆరోపణలు చేసిందని, ఇవి పక్కాగా రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయంటూ స్పష్టం చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తమ విచారణ వెల్లడైనట్లు తెలిపింది ఏపీసీసీ. ఇందులో భాగంగానే పార్టీ నుండి బహిష్కరించినట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్ పై మాజీ అస్సాం చీఫ్ అంకితా దత్తా సంచలన ఆరోపణలు చేసింది. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడంటూ వాపోయింది. ఇదే విషయం గురించి పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది బాధితురాలు. తనను బహిష్కరించినా పోరాడుతూనే ఉంటానని హెచ్చరించారు అంకితా దత్తా(Ankitha Dutta).
ఇదిలా ఉండగా అస్సాం లోని దిస్పూర్ పోలీస్ స్టేషన్ లో శ్రీినివాస్ పై అంకితా దత్తా ఫిర్యాదు చేసింది. సీబీఐ నోటీసు ఇచ్చింది బీవీ శ్రీనివాస్ కు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఆరోపణలపై విచారణ జరపాలని కోరింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన అంకితా దత్తాపై పరువు నష్టం దావా వేశారు బీవీ శ్రీనివాస్.
Also Read : కర్ణాటక ఎన్నికల బరిలో 3,044