Congress Focus : కాంగ్రెస్ లో రచ్చ హైకమాండ్ చర్చ
ఫోకస్ పెట్టిన ప్రియాంక..డిగ్గీ రాజా
Congress Focus : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న సీనియర్ల కిరికిరిపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఫోకస్(Congress Focus) పెట్టింది. సీనియర్లు వర్సెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. సీనియర్లు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి గౌడ్ , దామోదర్ రాజనర్సింహ్మ, జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.
హైకమాండ్ తో తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. దీనికి కౌంటర్ గా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 13 మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. మరో వైపు పార్టీకి నష్టం కలిగించే సీనియర్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని పేర్కొన్నారు అద్దంకి దయాకర్.
దీంతో గుస్సా అయిన సీనియర్లకు హై కమాండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీకి రావాల్సిందిగా కోరింది. దీనిని పరిష్కరించేందుకు గాను మధ్య ప్రదేశ్ కు చెందిన మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. అటు ప్రియాంక గాంధీతో పాటు ఇటు దిగ్విజయ్ సింగ్ సీరియస్ గా ఫోకస్ పెట్టారు.
ఇవాళే అటో ఇటో తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడానికి ఆమె కీలకమైన పాత్ర పోషించారు. ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. మరో వైపు పార్లమెంట్ లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మొత్తంగా ఏం జరుగుతుందనేది రేపటి లోగా తేలాల్సి ఉంది.
Also Read : రూ. 11.17 లక్షల కోట్ల రుణాలు రద్దు