MLC Nominations: ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేసిన బల్మూరి వెంకట్, మహేశ్‌ గౌడ్‌ !

ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేసిన బల్మూరి వెంకట్, మహేశ్‌ గౌడ్‌ !

MLC Nominations: తెలంగాణా శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్‌(Congress) పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కాగా… కాంగ్రెస్‌ అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఈ నామినేషన్‌ కు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హాజర య్యారు. వీరితో పాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ ఈనెల 11న వెలువడింది. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలించి, 22 వరకు నామినేషన్ల ఉపసంహారణకు అవకాశం ఇచ్చారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

MLC Nominations – ఎన్నిక ఏకగ్రీవమే !

119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్‌కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీనితో కాంగ్రెస్‌ తరపున ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు ల్మూరు వెంకట్, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నామినేషన్లు దాఖలు చేసారు. దీనితో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

Also Read : Supreme Court Notice : రామానాయుడు స్టూడియో భూముల అమ్మకంపై సుప్రీం కోర్టు నోటీసులు

Leave A Reply

Your Email Id will not be published!