One Nation One Elections: ‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
One Nation One Elections: ‘జమిలి ఎన్నికలు’ (ఒకే దేశం- ఒకే ఎన్నిక) ఆలోచన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు విరుద్ధమని… ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) డిమాండ్ చేసారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక అనే ఆలోచనే అప్రజాస్వామికమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీకి మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. దేశంలో పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే… ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని ఆయన లేఖలో కోరారు. “రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా… కమిటీ ఛైర్మన్ తన వ్యక్తిత్వాన్ని, మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు కేంద్రాన్ని అనుమతించవద్దు. పార్టీ, దేశ ప్రజల తరఫున ఈమేరకు అభ్యర్థిస్తున్నా’’ అని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు.
One Nation One Elections – ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ అంటే ఏమిటి ?
భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి నిర్వహించకపోవడం. అసెంబ్లీ ఎన్నికలు వేరుగా, పార్లమెంట్ ఎన్నికలు వేరుగా నిర్వహించడం వలన ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు అధిక వ్యయం కావడంతో పాటు… ఆ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రస్తుత బిజేపి ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ పేరుతో జమిలి ఎన్నికల నిర్వహణకు బిజేపి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల నిర్వహణపై అధ్యయనం కోసం గతేడాది సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. అప్పటినుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. ఈ అంశంపై మాజీ ఎన్నికల ప్రధానాధికారులు, హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్లతో కమిటీ ఛైర్మన్ రామ్నాథ్ కోవింద్ తాజాగా చర్చలు ప్రారంభించారు.
Also Read : MLC Nominations: ఎమ్మెల్సీలుగా నామినేషన్లు వేసిన బల్మూరి వెంకట్, మహేశ్ గౌడ్ !