Punjab Election 2022 : పంజాబ్ లో ‘బాద్ షా’ ఎవ్వ‌రో

కాంగ్రెస్..ఆప్ మ‌ధ్య‌నే పోటీ

Punjab Election 2022 : దేశం చూపు ఇప్పుడు పంజాబ్ వైపు చూస్తోంది. పంజాబ్ లో ఎన్నిక‌ల స‌మ‌రం(Punjab Election 2022) ముగిసింది. ఇక ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లో ఉంది. అత్య‌ధికంగా ద‌ళితులే కీల‌కంగా మార‌నున్నారు.

ఓట‌ర్లు ఎవ‌రి వైపు మొగ్గు చూపుతార‌నే దానిపై టెన్ష‌న్ నెల‌కొంది.

కాంగ్రెస్ పార్టీతో పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీ, పంజాబ్ లోక‌ల్ కాంగ్రెస్ , ఆమ్ ఆద్మీ పార్టీ,

శిరోమ‌ణి అకాళీద‌ళ్ పార్టీలు బ‌రిలో ఉన్నాయి. కానీ ప్ర‌ధానంగా అధికార పార్టీ, ఆప్ మ‌ధ్యే పోటీ నెల‌కొంది.

ఏడీఆర్ సైతం ఆయా పార్టీల నేత‌ల ఆస్తుల లెక్క‌లు వెల్ల‌డించింది.

విచిత్రం ఏమిటంటే శిరోమ‌ణి అకాలీద‌ళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్ రూ. 100 కోట్ల‌కు పైగా ఉండ‌డం విశేషం.

ఇదే స‌మ‌యంలో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (Punjab Election 2022)పై సంచ‌ల‌న

ఆరోప‌ణ‌లు చేయ‌డం కొంచెం ఇబ్బందిగా మారింది. అన్ని పార్టీలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

బీజేపీ, శిరోమ‌ణి అకాలీద‌ళ్ కీల‌కంగా మారుతామ‌ని భావిస్తున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్, ఆప్ భారీ ఎత్తున హామీలు ఇచ్చాయి.

కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త పోరు ఆ పార్టీకి శాపంగా మారింది. బీజేపీ, అమ‌రీంద‌ర్ సింగ్ క‌లిసి పోటీ చేస్తున్నారు.

ద‌ళిత ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉన్న పంజాబ్ లో ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీకి సీఎంగా చాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ హైక‌మాండ్.

పంజాబ్ లో 2014 లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు సీట్ల‌ను గెలుచు కోవ‌డంతో ఆప్ మ‌రోసారి త‌న స‌త్తా చాటుతోంది. కాంగ్రెస్ కు ప్ర‌ధాన పోటీదారుగా మారింది ఆప్. ఢిల్లీ త‌ర‌హా పాల‌న తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు ఆప్ చీఫ్.

అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డాగా మారి పోయిందంటూ అధికార పార్టీని టార్గెట్ చేశారు. అంతే కాకుండా త‌మ పార్టీ ఎంపీ భ‌గ‌వంత్ మాన్ ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాడు కేజ్రీవాల్.

ఇక కాంగ్రెస్ పార్టీ సైతం సీఎం అభ్య‌ర్థిగా మ‌రోసారి చ‌న్నీనే ప్ర‌క‌టించింది. ఇక అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌భావం అంతంత మాత్రంగానే ఉంది.

ఇక ఎవ‌రు బాద్ షా అనేది మార్చి 10న తేల‌నుంది. ఆధిక్యం వ‌స్తుందా లేక హంగ్ ఏర్ప‌డుతుందా అనేది తేలుతుంది.

Also Read : ఏబీజీ నిర్వాకం రూ. 22, 842 కోట్ల మోసం

Leave A Reply

Your Email Id will not be published!