Diljit Dosanjh : జోడి రిలీజ్ పై స్టే దిల్జిత్ సారీ
మన్నిమంచమని కోరిన సింగర్
Diljit Dosanjh : దేశానికి చెందిన మోస్ట్ పాపులర్ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh) తన ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు. మే 5న శుక్రవారం తన పంజాబీ చిత్రం జోడీని కోర్టు స్టే విధించింది. సోషల్ మీడియా వేదికగా దిల్జీత్ దోసాంజ్ స్పందించాడు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఏమీ అనుకోవద్దంటూ కోరాడు.
పంజాబ్ లోని స్థానిక కోర్టు చిత్రం విడుదలపై స్టే ఆర్డర్ జారీ చేసింది. కోర్టు నిర్ణయం పట్ల బాధగా ఉన్నా గౌరవించక తప్పదు. ఎందుకంటే ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని పేర్కొన్నాడు. జోడీ చిత్రం కోసం 100 శాతం పని చేశామని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఇండియాలో ఇవాళ విడుదల కావడం లేదన్నాడు దిల్జిత్ దోసాంజే(Diljit Dosanjh). ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారంతా క్షమించాలని కోరాడు సింగర్.
మే 3న , మే5న సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు పంజాబ్ లోని లూథియానా కోర్టు దివంగత పంజాబీ సింగర్ అమర్ సింగ్ చమ్కిలా , అతని రెండో భార్య పై బయో పిక్ గా భావిస్తున్న జోడి తేరీ మేరీ విడుదలను నిలిపి వేయాలని ఆదేశించింది కోర్టు.
అమర్ జోత్ కౌర్, దిల్జిత్ , నిమ్రత్ ఖైరా, చమ్కిలా భార్య గుర్మైల్ కౌర్ , రిథమ్ బాయ్జ్ కు చెందిన కరాజ్ గిల్ , దల్జిత్ థిండ్ లతో , కరణ్ దీప్ కౌర్ కు సమన్లు జారీ చేశారు. మే 8 లోపు తుది తీర్పు వెలువడనుంది.
Also Read : కేరళ స్టోరీ నిర్మాతకు కోర్టు షాక్
