CPI Narayana : చిత్ర పరిశ్రమపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

సందేశాత్మక చిత్రాలకు కొంతైనా సహాయం చేయకుండా మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు...

CPI Narayana : సాధారణంగా ప్రయోజనాత్మమైన సినిమాలు తీస్తే ప్రజలు ఆదరిస్తారని.. మధ్యమధ్యలో మంచి సందేశాత్మక సినిమాలైనా ఒకోసారి ఆడకపోవడం కారణంగా నష్టాలు రావడంతో నిర్మాతలు ముందుకు రావడంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ(CPI Narayana) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నిర్మాతలు వందల కోట్లతో చిత్రాలు నిర్మించి, అధికంగా వసూలు చేసే నిమిత్తం ప్రేక్షకులపై భారం వేస్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో బ్లాక్‌లో టికెట్లు అమ్మేందుకు ప్రయత్నిస్తూ, అదే విధంగా ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాలు పొందుతూ కూడా ప్రభుత్వం అనుమతితోనే టికెట్ల ధరలు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నారు. ఒకవైపు వేయి కోట్ల పెట్టుబడి పెట్టి రెండు వేల కోట్ల వసూళ్ళతో విజయం సాధించామని గర్వంతో ప్రకటించుకొనే ఈ భారీ చిత్ర నిర్మాతలకు అసలు ప్రాథమికంగా ప్రభుత్వాలు సహాయం చేయడమేమిటి అని ప్రశ్నించారు.

CPI Narayana Comments

సందేశాత్మక చిత్రాలకు కొంతైనా సహాయం చేయకుండా మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. నేర ప్రవృత్తి, హింసాయుత ఇతివృత్తం, అసభ్య వ్యంగ్యార్థ సంభాషణలు కలిగిన సినిమాలను ప్రభుత్వాలెందుకు ప్రోత్సహించాలని నిలదీశారు. భారీ చిత్రాల సినిమా హీరోలు.. సినిమా విడుదల సమయంలో రోడ్ షో చేస్తే తొక్కిసలాట జరగొచ్చు ముందుగా గ్రహించి రోడ్ షో చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిరోధించలేక పోయిందని విమర్శించారు. ఎర్రచందన అక్రమ రవాణాలు, వాటి విక్రయం అనేవి పూర్తి చట్టవిరుద్ధమైన చర్యలని తెలిసీ.. వాటిని కథా వస్తువుగా గ్రహించి, దాని చుట్టూతా యువతని మాయచేసి ఆకర్షించే సంభాషణలు, పాటలు, సీన్‌లు, డాన్సులు, అల్లర్లు చేస్తున్నారని మండిపడ్డారు.

సాంఘిక బాధ్యతను పక్కనబెట్టి కేవలం ధనార్జనే పరమావధిగా వ్యాపారాలు చేసే బడా నిర్మాతలను ప్రభుత్వాలే టికిట్‌ ధరల రూపంలో ప్రోత్సహించడం తీవ్రంగా చర్చ చేయాల్సిన విషయమన్నారు. చిత్రంలోని పాటలకున్న సాహిత్యం వాటిని అభినయించే తీరును స్వయానా హీరోయిన్ రష్మికయే(Rashmika) ప్రశ్నించిందన్నారు. నిర్మాత వత్తిడి కారణంగా తప్పని స్థితిలో చేశానని అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు. పుష్ప హీరోయిన్ ఆవేదన ప్రభుత్వానికి ఆదర్శం కావాలన్నారు. కళారంగం లక్ష్మణ రేఖను దాటకూడదని చెప్పుకొచ్చారు. అదే విధంగా భారీగా ఖర్చు చేసి అనైతిక సినిమాలు తీసి వేలకోట్లు లాభాలార్జిస్తు రాయతీలు కోసం పైరవీలు, ప్రజల మీద భారం పడేట్లు ప్రభుత్వం పాల్పడకూడదని హితవుపలికారు.

ఈ నేపథ్యంలో ‘‘ప్రభుత్వానికి సినిమా నాయత్వానికి, దానికి సారథ్యం వహిస్తున్న దిల్ రాజు మధ్య జరుగనున్న చర్చలలో భారత కమ్యానిస్టు పార్టీ తరపున మేం కోరేదేమంటే. కథా ఇతివృత్తం, సాంఘిక బాధ్యత పోషణ, తెలుగు సమాజం, వాటి కళా విలువల సంరక్షణ వంటి ప్రధాన లక్షణాల ఆధారంగా మాత్రమే ప్రభుత్వాలు ఇదమిద్ధమైన సినిమాను ప్రోత్సహించాలో లేదో నిర్ణయాలు తీసుకునే ఒక సమతూకతో కూడిన వ్వవస్థ కోసం ప్రభుత్వమే సంకల్పించాలి. అదే విధంగా సినిమా నిర్మాణ వ్యవస్థ, ప్రజలు, ప్రభుత్వాలు, పాలనాయంత్రాంగం అన్నీ వారి బాధ్యతలు సమర్థంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని అమలుచేయాలి’’ అని నారాయణ(CPI Narayana) కోరారు.

Also Read : Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

Leave A Reply

Your Email Id will not be published!