Jos Buttler Love : బ‌ట్ల‌ర్ కు ల‌వ్ ప్ర‌పోజ‌ల్

ఈజీగా తీసుకున్న క్రికెట‌ర్

Jos Butlter Love : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో అరుదైన స‌న్నివేశాల‌కు వేదికైంది. సినీ తార‌ల త‌ళుకు బెళుకులు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారాయి. జూహీ చావ్లా, స‌హానా ఖాన్ , ప్రీతి జింతా, షాన‌యా క‌పూర్ తో పాటు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిఇఓ కావ్య మార‌న్ నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారారు.

ఇక క్రికెట‌ర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆట‌గాళ్ల‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చెప్ప‌న‌క్క‌ర్లేదు. వాళ్లంటే ప‌డి చ‌చ్చే వాళ్లు వేల‌ల్లో ఉన్నారు. వారంతా అమ్మాయిలే కావ‌డం విశేషం. తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. త‌ను ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ ఓపెన‌ర్ , ఇంగ్లండ్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(Jos Buttler).

అత్య‌ధిక ప‌రుగుల ఆట‌గాళ్ల జాబితాలో బ‌ట్ల‌ర్ కూడా ఉన్నాడు. తాజాగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండ‌గా ఉన్న‌ట్టుండి ఓ అమ్మాయి ఎంట‌రైంది. త‌న‌కు జోస్ బ‌ట్ల‌ర్(Jos Buttler Love) అంటే పిచ్చి అభిమాన‌మ‌ని, నువ్వు లేకుండా ఉండ‌లేనంటూ పేర్కొంది. దీనికి బ‌ట్ల‌ర్ అవాక్క‌య్యాడు. ఆ త‌ర్వాత తేరుకున్నాడు. అమ్మాయితో ముచ్చ‌టించాడు. చివ‌ర‌కు సంత‌కం చేయ‌డంతో అభిమాని అంతులేని సంతోషానికి లోనైంది.

ఇందుకు సంబంధించిన ఫోటోను , వీడియోను షేర్ చేసింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్ టీమ్. ట్విట్ట‌ర్ లో ఈ ఫోటో , వీడియో వైర‌ల్ గా మారింది. విచిత్రం ఏమిటంటే సున్నితంగా తిర‌స్క‌రిస్తూ అభిమానిని ఆనంద ప‌రిచేలా చేసిన బ‌ట్ల‌ర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్.

Also Read : సౌదీ క్రికెట్ లీగ్ లో మ‌నోళ్లు ఆడ‌రు

Leave A Reply

Your Email Id will not be published!