VVS Laxman Pant : లక్ష్మణ్ నిర్వాకం అభిమానుల ఆగ్రహం
నెంబర్ 4లో రిషబ్ పంత్ రాణిస్తున్నాడు
VVS Laxman Pant : న్యూజిలాండ్ టూర్ లో పర్యటిస్తున్న భారత జట్టుకు తాత్కాలిక కోచ్ గా ఎంపికైన వంగీపురం వెంకట సాయి లక్ష్మణ్ (వీవీఎస్) పై నిప్పులు చెరుగుతున్నారు క్రికెట్ అభిమానులు. అద్భుతంగా రాణిస్తున్నా ఎందుకని సంజూ శాంసన్ ను పక్కన పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మూడో వన్డే మ్యాచ్ కు ముందు లక్ష్మణ్(VVS Laxman) మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్ సందర్భంగా నెంబర్ 4లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడని అందుకే అతడిని తీసుకున్నామని సెలవిచ్చాడు కోచ్ లక్ష్మణ్. ఇప్పుడు లక్ష్మణ్ ను టార్గెట్ చేశారు ఫ్యాన్స్ . గత 11 ఇన్నింగ్స్ లు రిషబ్ పంత్ ఆడితే 10 ఇన్నింగ్స్ లలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడని మండిపడ్డారు.
ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సీరియస్ గా స్పందించారు. ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా లక్ష్మణ్ ను నిలదీశారు. ఒక రకంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు కోచ్ గా ఎవరి ప్రతిభ ఏమిటి, ఎవరి స్ట్రైక్ రేట్ ఎంతుందనే దానిపై క్లారిటీ లేదా అని ప్రశ్నించాడు శశి థరూర్.
ఇదే సమయంలో ఎందుకు పంత్ ను వెనకేసుకు వస్తున్నారంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై మండిపడ్డాడు. ఇదిలా ఉండగా లక్ష్మణ్ కోచ్ గా పనికి రాడంటున్నారు ఫ్యాన్స్.
ఎవరైనా ఏ జట్టు సెలెక్షన్ కమిటీ అయినా ముందస్తుగా రాణించిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటారని కానీ వరుసగా విఫలమవుతూ వచ్చిన పంత్ లాంటి వాళ్లను తీసుకోరంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో రిషబ్ పంత్ కు మద్దతు పలకడంపై భగ్గుమంటున్నారు.
Also Read : పది’కే ‘పంత్’ పరిమితం సర్వత్రా ఆగ్రహం