CWG 2022 Eldhose Paul : ట్రిపుల్ జంప్ లో ‘ఎల్డోస్’ కు స్వ‌ర్ణం

కామ‌న్వెల్త్ గేమ్స్ లో అబూ బ‌క‌ర్ రజ‌తం

CWG 2022 Eldhose Paul : బ్రిట‌న్ లో జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్ -2022 లో భార‌త్ హ‌వా కంటిన్యూగా కొన‌సాగుతోంది. పురుషుల ట్రిపుల్ జంప్ లో ఎల్ డోస్ పాల్(CWG 2022 Eldhose Paul) 17.03 మీట‌ర్ల బెస్ట్ జంప్ తో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు.

అబ్దుల్లా అబూబ‌క‌ర్ 17.02 ర‌జ‌త ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. భార‌త కీర్తి ప‌తాకాన్నిఎగుర వేశారు. మ‌రో భార‌తీయ క్రీడాకారులు చిత్ర‌వేల్ నాల్గవ స్థానంలో నిలిచాడు.

కొద్ది పాటి తేడాతో ప‌త‌కాన్ని కోల్పోయాడు. ఇక పాల్ త‌న మూడో జంప్ తో ఆధిక్యంలోకి వెళ్లాడు. త‌న ఆరు ప్ర‌య‌త్నాల‌లో 17 మీట‌ర్ల మార్కును అధిగ‌మించాడు.

ఇక అబూ బ‌క‌ర్ చివ‌రి వ‌ర‌కు స్థిరంగా కొన‌సాగుతూ వ‌చ్చాడు. త‌న 5వ ప్ర‌య‌త్నంతో ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించాడు. కొద్ది పాటి తేడాతో ప‌సిడి ప‌తకాన్ని కోల్పోయాడు.

ఇక చిత్ర వేల్ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నం చేశాడు. చివ‌రికి కాంస్య ప‌త‌కాన్ని సాధించామ‌ని కృషి చేశాడు. కానీ బ్రూనై జ‌హ్ న్తై పెరిన్ చీఫ్ 16.92 మీట‌ర్ల జంప్ ను అధిగ‌మించ లేక పోయాడు.

2018 నుండి అథ్లెటిక్స్ లో భార‌త దేశం అత్య‌ధిక ప‌త‌కాలు సాధించింది. ముందుకు దూసుకు వెళుతుండ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా భార‌త అథ్లెట్లు అత్య‌ద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌దర్శించి దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచినందుకు ప్ర‌ధాన మంత్రి మోదీ అభినందించారు.

మీరు సాధించిన ఈ విజ‌యాలు భావి భార‌త యువ‌త‌కు ఆద‌ర్శ‌నీయంగా ఉంటుంద‌న్నారు. ఈసారి భార‌త్ ఖాతాలో 41 ప‌త‌కాల‌కు పైగా చేరాయి. ఇవాళ రేప‌టితో మ‌రిన్ని అద‌న‌పు ప‌త‌కాలు ద‌క్క‌నున్నాయి.

Also Read : కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త్ ప‌త‌కాల వేట‌

Leave A Reply

Your Email Id will not be published!