CWG 2022 Sharath & Sreeja : శ్రీజ శరత్ జంటకు బంగారు పతకం
టేబుల్ టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్
CWG 2022 Sharath & Sreeja : బ్రిటన్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్ -2022(CWG 2022) లో భారత్ సత్తా చాటుతోంది. 50 పతకాలను దాటేసింది. దుమ్ము రేపుతోంది. టేబుల్ టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో శ్రీజ – శరత్ జంటకు బంగారు పతకం దక్కింది.
ఫైనల్లో శ్రీజ – శరత్ కమల్ ద్వయం 11-4, 9-11, 11-5 , 11-6 తో మలేషియా కు చెందిన జూవెన్ చూంగ్ – లిన్ కరెన్ జోడీపై గెలుపొందింది. జాబితాలో భారత్ కు 18 స్వర్ణాలు దక్కాయి.
మొత్తం 53 పతకాలు దక్కాయి. ఇంకో వైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్ – సత్యన్ జ్ఞాన శేఖరన్ 11-8 , 8-11, 3-11, 11-7, 4-11 తో పాల్ డ్రింక్ హాల్ – లియామ్ పిచ్ ఫోర్డ్ జోడీ చేతిలో ఓటమి పాలైంది.
దీంతో ఈ జోడికి తృటిలో స్వర్ణం దక్కలేదు. రజత పతకంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మరో వైపు పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో శరత్ కమల్(Sharath) 11-8, 11-8, 8-11, 11-7, 9-11, 11-8 తో పాల్ డ్రింక్ హాల్ ను ఓడించాడు.
ఏకంగా ఫైనల్ కు చేరాడు. కాగా గెలిస్తే స్వర్ణం లేదంటే పక్కా రజత పతకం ఖాయం. మరో సెమీస్ లో సత్యన్ జ్ఞాన శేఖరన్ లియామ్ పిచ్ ఫోర్డ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
కాంస్య పతకం కోసం మరోసారి మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు మహిళల సింగిల్స్ లో శ్రీజ(Sreeja) కాంస్య పతకాన్ని కోల్పోయింది. చివరి వరకు పోరాడింది కానీ ఓటమి పాలైంది.
ఇక కామన్వెల్త్ గేమ్స్ లో మొదటిసారిగా ప్రవేశ పెట్టారు మహిళా క్రికెట్ ఈవెంట్. భారత జట్టు ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోయింది. రజత పతకం దక్కింది.
Also Read : ఆఖరి టి20లోనూ మనదే హవా