Daggubati Purandeswari : పోటీ విష‌యం పార్టీ నిర్ణ‌యం

ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి కామెంట్

Daggubati Purandeswari : ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. బుధ‌వారం పురందేశ్వ‌రి ఆమె మాట్లాడారు. తాను ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే దానిపై బీజేపీ హైక‌మాండ్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Daggubati Purandeswari Words

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం ఎక్క‌డా వివ‌క్ష చూప‌లేద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కోట్లాది రూపాయ‌లు ఇచ్చిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని పేర్కొన్నారు. 1623 కోట్ల‌కు పైగా మంజూరు చేసింద‌న్నారు. ఆర్థిక శాఖ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంద‌న్నారు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.

అయితే ప్రాజెక్టుకు సంబంధించి పున‌రావాసం విష‌యంలో ఇంకా పూర్తి వివ‌రాలు కేంద్రానికి రాలేద‌న్నారు. ప్ర‌తి పైసాకు తాము లెక్క‌లు చెబుతామ‌ని, కానీ ఏపీ స‌ర్కార్ ఎందుకు చెప్ప‌డం లేదో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పురందేశ్వ‌రి(Daggubati Purandeswari) డిమాండ్ చేశారు. తాము కూడా త్వ‌ర‌లో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిని క‌లుస్తామ‌ని చెప్పారు.

మ‌రోసారి జ‌న‌సేన పార్టీ విష‌యంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ పార్టీతో త‌మ పార్టీ పొత్తు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించి కేంద్రం మంజూరు చేసిన నిధుల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ దారి మ‌ళ్లిస్తోంద‌ని ఆరోపించారు పురందేశ్వ‌రి.

Also Read : BJP Leaders Slams : ధ‌ర్మ‌పురి అర్వింద్ పై నేత‌ల గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!