Daggubati Purandeswari : తెలుగును కాపాడుకోక పోతే కష్టం
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : విజయవాడ – ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష రాను రాను అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒకరూ ఆంగ్లంపై మోజు పెంచుకుంటున్నారని కానీ మాతృ భాషను విస్మరించడం దారుణమని పేర్కొన్నారు.
Daggubati Purandeswari Comments Viral
విజయవాడలో మాతృ భాష మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాషను పరిరక్షించు కోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
మన సంసృతి, సాంప్రదాయం మన మాతృ భాష అయిన సాహిత్యంలో నిక్షిప్తమై ఉందని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. మెరుగైన జీవన ప్రమాణాల కోసమని ఆంగ్లం అవసరమైనా మాతృ భాష మాత్రమే ముందుకు నడిపిస్తుందని చెప్పారు.
మన భాషను సంరక్షించుకుంటేనే మన సంస్కృతి, సంప్రదాయం నిలబెట్టుకుంటామని అందుకు అందరూ పార్టీల కతీతంగా కృషి చేయాలని కోరారు. తమ తండ్రి ఎన్‌టిఆర్ మాతృ భాష తెలుగు, జాతీయ భాష హిందీ, ఆశ్రయం పొందుతున్న తమిళం ఆవశ్యతను వివరించి వాటిలో తర్ఫీదు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
Also Read : Jonnavithula Ramalingeswara Rao : మాతృ భాషతోనే వికాసం