Daggubati Purandeswari : ఏపీ సర్కార్ పై పురందేశ్వరి ఫైర్
వచ్చిన పెట్టుబడులు ఎక్కడికెళ్లాయి
Daggubati Purandeswari : ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఇప్పటి దాకా వచ్చిన పెట్టుబడులు ఎందుకు వెనక్కి వెళ్లాయంటూ ప్రశ్నించారు. దీనికి ఏపీ సర్కార్ ముందు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం రూ. 20,000 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 65 శాతం ఇళ్లు పూర్తి కావాల్సి ఉండగా ఒప్పటి వరకు 30 శాతం కూడా ఇళ్లు పూర్తి కాలేదన్నారు.
Daggubati Purandeswari Words
తాము నిధులు పంపిస్తే జగన్ తాము చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) .దేశంలో గత 9 ఏళ్ల కాలంలో మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ లెక్కకు మించి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వెల్లడించారు బీజేపీ స్టేట్ చీఫ్.
ఏపీలో ఎందుకు పరిశ్రమలు రావడం లేదంటూ ప్రశ్నించారు. ఏయే కంపెనీలు వచ్చాయో, ఎన్ని పెట్టుబడులు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. త్వరలో తమ కార్యాచరణ ప్రణాళిక ఏమిటో వెల్లడిస్తామని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి.
Also Read : Iran Hijab : హిజాబ్ ధరించాల్సిందే – ఇరాన్