Iran Hijab : హిజాబ్ ధ‌రించాల్సిందే – ఇరాన్

ఇక నుంచి క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు

Iran Hijab : ఇరాన్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇక నుంచి హిజాబ్ ను ధ‌రించాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. ఎలాంటి నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు, ర్యాలీలు ఒప్పుకోమంటూ హెచ్చ‌రించింది. ఇటీవ‌ల పెద్ద ఎత్తున హిజాబ్ వివాదం చోటు చేసుకుంది ఇరాన్ లో. ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్రంగా ఖండించింది ఈ చ‌ర్య‌ల‌ను.

Iran Hijab Government

అయినా ఫాసిస్టు స‌ర్కార్ ఇరాన్ త‌న వైఖ‌రిని మార్చుకోలేదు. చివ‌ర‌కు హిజాబ్ ధ‌రించాల‌ని, లేక పోతే ఉక్కుపాదం మోపుతామంటూ వార్నింగ్ ఇచ్చింది. నిర‌స‌న‌ల త‌ర్వాత నెలల త‌ర‌బ‌డి క‌ఠిన‌మైన హిజాబ్ రూల్స్ ను అమ‌లు చేసేందుకు ఇరాన్(Iran) నైతిక‌త పోలీసు గ‌స్తీని పున‌రుద్ద‌రించింది.

ఎవ‌రైనా స‌రే నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే వారిని గుర్తించేందుకు నిఘా కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఒక‌వేళ కెమెరాలు లేక పోతే వెంట‌నే ఎక్క‌డ అవ‌స‌రం అయితే అక్క‌డ ఉంచాల‌ని స్ప‌ష్టం చేసింది ఇరాన్ ప్ర‌భుత్వం. సీసీ కెమెరాల ఆధారంగా నిర‌స‌న‌కారులు, ఆందోళ‌న కారుల‌ను గుర్తించి వారికి త‌గిన రీతిలో శిక్షించ‌డం జ‌రుగుతుంద‌ని వార్నింగ్ ఇచ్చింది.

హెచ్చ‌రిక‌లు, జ‌రిమానాలు, అరెస్ట్ లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేసింది ఇరాన్ ప్ర‌భుత్వం. ఇదిలా ఉండ‌గా వ్యాపారాలు చేసుకునే వారితో పాటు న‌టులు, క‌ళాకారులు కూడా ఈ నిషేధాన్ని ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని పేర్కొంది.

Also Read :Jeevitha Rajasekhar : జీవిత..రాజ‌శేఖ‌ర్ కు 1 సంవత్సరం జైలు శిక్ష

Leave A Reply

Your Email Id will not be published!