#DavidWarner : ఆచార్య – డేవిడ్ వార్న‌ర్

వార్న‌ర్ ఆచార్య వైర‌ల్

David Warner : ఎక్క‌డి ఆస్ట్రేలియా ఎక్క‌డ ఇండియా. క‌ళ‌కు కులం లేదు మ‌తం లేదు. జాతి అంత‌క‌న్నా లేదు. కానీ రెండు రంగాలు సెల‌బ్రెటీల‌ను క‌లుపుతున్నాయి. రెండు దేశాల ప్ర‌జ‌ల‌ను ఊగి పోయేలా చేస్తున్నాయి. సంగీతం జీవ‌న సారం. క్రికెట్ జాతి మంత్రం. ఇక ఈ రెండూ క‌లిస్తే. ఇదేమిటి అనుకుంటున్నారా. ఆసిస్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner).

హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ఆట‌గాడు. అత‌డికి హైద‌రాబాద్ పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. ఇంకేం మ‌న హీరోల పాట‌ల‌ను ఇమిటేట్ చేయ‌డం, వాటిని వీడియోల రూపంలో సోష‌ల్ మీడియాలో పెట్డడం వార్న‌ర్ కు అల‌వాటై పోయింది. ఇపుడు అటు ఆసిస్ లో ఇటు ఇండియాలో డేవిడ్ వార్న‌ర్ బిగ్ స్టార్. తాజాగా ఈ క్రికెట్ ల‌వ‌ర్ ఇంకో ఫీట్ చేశాడు.

అదేమిటంటే టాలీవుడ్ లో టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ద‌ర్శ‌కుడు శివ కొర‌టాల సినిమా ఆచార్య‌లో న‌టిస్తున్నాడు. హైద‌రాబాద్ కోకాపేట ప్రాంతంలో భారీ సెట్టింగ్ మ‌ధ్య శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌లే చిత్ర యూనిట్ ఆచార్య టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఆ వీడియోకు భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది.

లాక్ డౌన్ స‌మ‌యంలో డేవిడ్ వార్న‌ర్(David Warner) ఎన్నో టిక్ టాక్ వీడియోలు చేసి అల‌రించాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు, అల్లు అర్జున్ సాంగ్స్ కు వీడియోలతో పాటు ప్ర‌భాస్ డైలాగ్ లతో వీడియోలు రూపొందించాడు. ఈ సారి రూటు మార్చి రీఫేస్ యాను ఉప‌యోగించుకుని అంద‌రినీ అల‌రించాడు. తాజాగా డేవిడ్ వార్న‌ర్ మెగాస్టార్ ఆచార్య‌గా మారి పోయాడు. చిరు డైలాగ్ లు చెబుతూ వీడియో పోస్ట్ చేశాడు. ఇపుడ‌ది వైర‌ల్ అవుతోంది.

 

No comment allowed please