#GuttiVankayaKoora : ఆంధ్ర ఫేమస్ డిష్ గుత్తి వంకాయ కూర..

ఇది ఆంధ్ర ఫేమస్ డిష్.

GuttiVankayaKoora : గుత్తి వంకాయ అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో.. అంత ఫేమస్ గుత్తి వంకాయ కూర. ఇది ఆంధ్ర ఫేమస్ డిష్. ఏ ఫంక్షన్ అయినా.. లేదా పెళ్లి అయినా ఈ కూర తప్పకుండ ఉండాల్సిందే. మరి ఈ రోజు మనం గుత్తి వంకాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

గుత్తి వంకాయలు – 1/2 కేజీ
ఉల్లిపాయలు – 2
ధనియాల పొడి – 1/2 టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
కొబ్బరి – చిన్న ముక్క
అల్లం వెల్లుల్లి – కొద్దిగా
నూనె – 4 టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్
పల్లీలు – 1/4 కప్పు
చింతపండు – నిమ్మకాయ సైజులో
దాల్చిన చెక్క – చిన్న ముక్క
లవంగాలు – 2
గరం మసాలా – 1 స్పూన్

తయారుచేయు విధానం :

ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో పల్లీలు, కొబ్బరి ముక్కలు వేసి వేగాక చివరగా నువ్వులు వేసి దోరగా వేగాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కల్ని కూడా లైట్ గా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు మిశ్రమం, కారం పొడి, ధనియాలు పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉప్పు, గరం మాసాల అన్ని వేసి కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసి వుంచుకోవాలి.

తర్వాత వంకాయల్ని నిలువుగా గాట్లు పెట్టి మసాలా ముద్దను కట్ చేసి వుంచిన వంకాయల్లో పెట్టాలి. తరువాత మరో పాన్ తీసుకుని స్టౌ మీద పెట్టి నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, లవంగాలు స్టఫ్ చేసిన వంకాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతున్న సమయంలో స్టఫ్ చేయగా మిగిలిన మసాలా ముద్దకూడా వేయాలి. కొద్దిగా మగ్గి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చింతపండు రసం పోసుకుని తక్కువ మంట మీద 20 నిముషాలు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర రెడీ అయినట్లే.

 

No comment allowed please