David Warner Comment : క్రికెట్ పై వార్న‌ర్ చెర‌గ‌ని ముద్ర

టెస్టు క్రికెట్ కు ఇక గుడ్ బై చెప్ప‌నున్న స్టార్

David Warner Comment : డేవిడ్ వార్న‌ర్ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ క్రికెట్ లో మోస్ట్ వాంటెడ్ క్రికెట‌ర్ గా కొన‌సాగుతూ వ‌చ్చాడు. ప్ర‌తి క్రికెట‌ర్ కెరీర్ లో ఎత్తు ప‌ల్లాలు ఉన్న‌ట్లే వార్న‌ర్(David Warner) ప్ర‌యాణంలో కూడా ఎగుడు దిగుడులు ఉన్నాయి. అంత‌కు మించిన అవ‌మానాలు కూడా లేక పోలేదు. ఇది ప‌క్క‌న పెడితే ఈ ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్ ఆడ‌డంలో వెరీ స్పెష‌ల్. ఫోర్లు, సిక్సర్ల‌ను అల‌వోక‌గా బౌండ‌రీ కి త‌ర‌లించ‌డంలో ఆరి తేరాడు. ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు సాధించిన విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించాడు. నిషేధానికి గుర‌య్యాడు. ఆ త‌ర్వాత ఫీనిక్స్ ప‌క్షిలా తిరిగి లేచి వ‌చ్చాడు. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మ‌ళ్లీ కింద ప‌డ్డాడు. కానీ వెన‌క్కి తిరిగి చూడ‌లేదు.

ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు క‌ప్ తీసుకు వ‌చ్చి పెట్టాడు. అదే జ‌ట్టు యాజ‌మాన్యం వార్న‌ర్ ను నెట్టేసింది. దారుణంగా అవ‌మానించింది. ఒకానొక ద‌శ‌లో ఐపీఎల్ వేలం పాట‌లో ఏ ధ‌ర‌కు అమ్ముడు పోని క్రికెట‌ర్ గా నిలిచాడు. కానీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ వార్న‌ర్(David Warner) ను న‌మ్మింది. అత‌డిని తీసుకుంది. చివ‌ర‌కు అత‌డిని రిష‌బ్ పంత్ గాయ‌ప‌డ‌డంతో కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఈసారి జ‌రిగిన ఐపీఎల్ 16వ సీజ‌న్ లో అద్బుతంగా ఆడాడు. వ్య‌క్తిగ‌తంగా రాణించినా త‌న జ‌ట్టులో ఇత‌ర ఆట‌గాళ్లు స‌హ‌క‌రించ‌క పోవడంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిరాశ ప‌రిచింది. ఇది ప‌క్క‌న పెడితే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు డేవిడ్ వార్న‌ర్.

ఇంగ్లండ్ లోని ఓవెల్ వేదిక‌గా జూన్ 7 నుంచి ప్ర‌పంచ టెష్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. భార‌త్ , ఆస్ట్రేలియా జ‌ట్లు పోటీ ప‌డ‌నున్నాయి. మ్యాచ్ ఆరంభం కంటే ముందు డేవిడ్ వార్న‌ర్(David Warner) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. వ‌చ్చే ఏడాది నుంచి తాను టెస్టు మ్యాచ్ లు ఆడ‌టం లేద‌ని ప్ర‌క‌టించారు. వార్న‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది. క్రికెట్ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఆడే స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. టెస్టు ఫార్మాట్ నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు వార్న‌ర్.

పాకిస్తాన్ తో జ‌రిగే టెస్టు మ్యాచ్ త‌ర్వాత తాను వీడ్కోలు ప‌లుకుతానంటూ చెప్పాడు. అయితే 2024 లో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పాడు. కాగా వార్న‌ర్ 103 మ్యాచ్ లు ఆడాడు. 8,159 ర‌న్స్ చేశాడు. ఇందులో 25 సెంచ‌రీలు, 34 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. విజ‌య‌వంత‌మైన ఓపెన‌ర్ గా గుర్తింపు పొందాడు. విజ‌య‌వంత‌మైన ఓపెన‌ర్ల‌లో ఒక‌డిగా ఇప్ప‌టికీ గుర్తుండి పోతాడు. ఆట అన్నాక భావోద్వేగాలు స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నాడు. టెస్టు ఫార్మాట్ రంగం నుంచి వైదొల‌గాల‌ని తీసుకున్న నిర్ణ‌యం బాధాక‌రం.

Also Read : KTR IT Jobs : ఐటీ సెక్టార్ లో హైద‌రాబాద్ భ‌ళా – కేటీఆర్

 

Leave A Reply

Your Email Id will not be published!