David Warner : కుటుంబం కోసం వార్న‌ర్ భావోద్వేగం

\ పాకిస్తాన్ టూర్ కు వెళుతూ పోస్ట్

David Warner  : ప్ర‌పంచ క్రికెట్ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఆసిస్ క్రికెట‌ర్ల‌లో డేవిడ్ వార్న‌ర్(David Warner )ఒక‌రు. దుబాయి వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ సెకండ్ సీజ‌న్ లో దుమ్ము రేపాడు. ఫ‌స్ట్ సీజ‌న్ అత‌డిని తీవ్ర నిరాశ‌కు లోను చేసింది.

ఒకానొక స‌మ‌యంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మేనేజ్ మెంట్ అత‌డిని ఘోరంగా అవ‌మానించి గెంటి వేసింది. కానీ దెబ్బ తిన్న పులి ఊరుకుంటుందా. మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించింది.

అదే దుబాయి వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్భుతంగా ఆడాడు. టాప్ ప‌రుగుల లిస్టులో చోటు సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాకు ప్ర‌పంచ క‌ప్ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఆ త‌ర్వాత ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఇంగ్లండ్ సీరీస్ లో సైతం స‌త్తా చాటాడు. త‌న‌లో ఇంకా స్పార్క్ అలాగే ఉంద‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం పాకిస్తాన్ లో సుదీర్ఘ కాలం త‌ర్వాత ఆసిస్ వెళుతోంది.

ఈ సంద‌ర్బంగా త‌న ఫ్యామిలీని విడిచి వెళుతున్నందుకు చాలా బాధ‌గా ఉంద‌ని వాపోయాడు. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. విచిత్రం ఏమిటంటే వార్న‌ర్ భ‌య్యాకు ఆస్ట్రేలియాలో కంటే భార‌త్ లోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు.

మ‌నోడు తెలుగు సినిమాలంటే ఫిదా. పాట‌లు, డైలాగుల‌తో మీమ్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. ప్ర‌స్తుతం పాకిస్తాన్ కు బ‌య‌లు దేరే ముందు కుటుంబ స‌భ్యుల కోసం భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

త‌న భార్య‌, కుమార్తెల‌తో కూడిన ఫోటో పంచుకున్నాడు. త‌న ఫ్యామిలీకి వీడ్కోలు ప‌ల‌క‌డం ఎల్ల‌ప్పుడూ క‌ష్ట‌మేన‌ని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైర‌ల్ గా మారింది.

Also Read : త‌ల‌వంచిన శ్రీ‌లంక చెల‌రేగిన భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!