David Warner : వార్న‌ర్ భ‌య్యా మామూలు లేదుగా

ఫుల్ జోష్ మీదున్న ఆసిస్ క్రికెట‌ర్

David Warner : సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , ల‌వ్లీ గ‌ర్ల్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పుష్ప మూవీ పాన్ ఇండియా దేశాన్ని ఊపేసింది. అందులో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా న‌టి స‌మంత నిలిచింది.

ప్ర‌త్యేక పాట‌తో దేశాన్ని ఉర్రూత లూగించేలా చేసింది. ఎక్క‌డ చూసినా పుష్ప మేనియానే. సినిమాకు సంబంధించిన డైలాగులు, పాట‌లు హోరెత్తుస్తున్నాయి. ఇప్ప‌టి దాకా బ‌న్నీ సినీ కెరీర్ లో హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు సాధించిన మూవీగా నిలిచింది.

ఏకంగా 370 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ లలో ప్ర‌పంచ వ్యాప్తంగా 3 వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసింది.

సింగిల్ కార్డ్ పాట‌లు రాసిన ఘ‌న‌త చంద్ర‌బోస్ కే ద‌క్కుతుంది. చిత్రానికి సంబంధించి రాసిన అన్ని పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. ఇప్ప‌టికీ సామి సామి, ఊ అంటావా ఊఊ అంటావా మావా అన్న సాంగ్ హిస్ట‌రీ క్రియేట్ చేసింది.

తాజాగా భార‌తీయ క్రికెట‌ర్ల‌తో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన ప్లేయ‌ర్లు సైతం పుష్ప మూవీని ఇమిటేట్ చేస్తున్నారు. వీరిలో టాప్ లో ఉన్న‌డు ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్ భ‌య్యా(David Warner )

మ‌నోడు ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్లు, సాంగ్స్ కు డ్యాన్సుతో హోరెత్తించాడు. తాజాగా పుష్ప మూవీలోని సామి సామి సాంగ్ సూప‌ర్ హిట్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ సాంగ్ తో మీమ్స్ తో వీడియో హోరెత్తించాడు డేవిడ్ వార్న‌ర్ భ‌య్యా.

Also Read : ఐపీల్ ఫార్మాట్ బీసీసీఐ డిక్లేర్ర్

Leave A Reply

Your Email Id will not be published!