DC vs GT IPL 2023 : ఢిల్లీకి షాక్ గుజ‌రాత్ గ్రాండ్ విక్ట‌రీ

సుద‌ర్శ‌న్..మిల్ల‌ర్ షాన్ దార్ ఇన్నింగ్స్

DC vs GT IPL 2023 : 16వ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ వ‌రుస విజ‌యాల‌తో దుమ్ము రేపుతోంది. వార్న‌ర్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు(DC vs GT IPL 2023) ఇది రెండో ఓట‌మి. గాయం కార‌ణంగా రిష‌బ్ పంత్ దూరం కావ‌డంతో ఆయ‌న స్థానంలో వార్న‌ర్ కు యాజ‌మాన్యం స్కిప్ప‌ర్ గా ఛాన్స్ ఇచ్చింది. అయినా ఢిల్లీ టీమ్ లో మార్పు రావ‌డం లేదు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 163 ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 18.1 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. వృద్ది మాన్ సాహా 14 , శుభ్ మ‌న్ గిల్ 14 , పాండ్యా 5 త‌క్కువ స్కోర్ కే వెను దిరిగినా ఆ త‌ర్వాత బ‌రిలోకి దిగిన సాయి సుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. 48 బంతులు ఎదుర్కొన్న సుద‌ర్శ‌న్ 62 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. విజ‌య్ శంక‌ర్ 29, డేవిడ్ మిల్ల‌ర్ 31 ర‌న్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

అంత‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో(DC vs GT) కెప్టెన్ వార్న‌ర్ 32 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల‌తో 37 ర‌న్స్ చేశాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 30 రాణించ‌గా మిగ‌తా వాళ్లు తేలి పోయారు.

Also Read : గాయం తీవ్రం ర‌జత్ పాటిదార్ దూరం

Leave A Reply

Your Email Id will not be published!