DC vs KKR IPL 2023 : కోల్ క‌తాను క‌ట్ట‌డి చేసిన ఢిల్లీ

20 ఓవ‌ర్ల‌లో 127 ర‌న్స్

DC vs KKR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు చోటు చేసుకుంటున్నాయి. కేవ‌లం అత్యల్ప స్కోర్ అనుకుని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో బోర్లా ప‌డింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్(DC vs KKR IPL 2023) మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఆసిస్ స్టార్ , స్కిప్ప‌ర్ డేవిడ్ వార్న‌ర్ టాస్ గెలిచాడు. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

అత‌డు తీసుకున్న నిర్ణ‌యం మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కేవ‌లం 127 ప‌రుగుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఢిల్లీ బౌల‌ర్లు త‌మ ప్ర‌తాపాన్ని చూపించారు. ఇక కేకేఆర్ జ‌ట్టులో ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ అద్బుతంగా రాణించాడు. 39 బంతులు ఎదుర్కొన్న జేస‌న్ రాయ్ 43 ర‌న్స్ చేశాడు. ఆండ్రూ ర‌స్సెల్ 31 బాల్స్ ఎదుర్కొని 38 ర‌న్స్ చేశాడు. ఈ ఇద్ద‌రే టాప్ స్కోర‌ర్ కావ‌డం విశేషం. మిగతా బ్యాట‌ర్లు ఎవ‌రూ అంత‌గా ర‌న్స్ చేయ‌లేక పోయారు.

ఢిల్లీ బౌల‌ర్ల ధాటికి విల విల లాడారు కోల్ క‌తా బ్యాట‌ర్లు. ఒకానొక ద‌శ‌లో డిఫెన్స్ కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం ప్రాదాన్య‌త సంత‌రించుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో ఇసాంత్ శ‌ర్మ‌, నోకియా , అక్ష‌ర్ ప‌టేల్ , కుల్దీప్ యాద‌వ్ లు చెరో రెండు వికెట్ల చొప్పున ప‌డ‌గొట్టారు. ఇషాంత్ శ‌ర్మ దుమ్ము రేపాడు. 4 ఓవ‌ర్లు వేసిన శ‌ర్మ కేవ‌లం 18 ర‌న్స్ మాత్ర‌మే ఇవ్వ‌డం విశేషం. ఇక ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ బోణీ కొట్ట‌లేదు.

ఢిల్లీ బౌలర్ల దాటికి కోల్ కతా తక్కువ పరుగులకే చాప చుట్టేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోకియా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ముకేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. చాలా కాలం తర్వాత టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 19 పరుగులే ఇచ్చాడు.

Also Read : ఆర్సీబీ చేతిలో పంజాబ్ చిత్తు

Leave A Reply

Your Email Id will not be published!