DC vs KKR IPL 2023 : బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిట‌ల్స్

మ‌రోసారి మెరిసిన వార్న‌ర్ మామా

DC vs KKR IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఎట్ట‌కేల‌కు తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఢిల్లీలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. టాస్ గెలిచిన స్కిప్ప‌ర్ వార్న‌ర్ మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఢిల్లీ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు.

అనంత‌రం 128 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్(DC vs KKR IPL 2023) చివ‌రి దాకా పోరాడింది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొన‌సాగ‌డంతో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

ఈసారి సీజ‌న్ లో వ‌రుస‌గా రాణిస్తూ వ‌స్తున్నాడు ఆసిస్ స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్. 41 బంతులు ఎదుర్కొని 57 ర‌న్స్ చేశాడు. దీంతో కోల్ క‌తా పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 4 వికెట్ల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ కోల్ క‌తాపై తొలి గెలుపును అందుకుంది.

5 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా ఓడి పోయింది. ఇక రెగ్యుల‌ర్ స్కిప్ప‌ర్ గా ఉన్న రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌డంతో డేవిడ్ వార్న‌ర్ కు ప‌గ్గాలు అప్ప‌గించింది డీసీ మేనేజ్ మెంట్. అంత‌కు ముందు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ లో జేస‌న్ రాయ్ రాణించాడు. 43 ర‌న్స్ చేశాడు. ఆండ్రీ ర‌స్సెల్ 38 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు.

Also Read : కోల్ క‌తాను క‌ట్ట‌డి చేసిన ఢిల్లీ

Leave A Reply

Your Email Id will not be published!