DC vs MI WPL 2023 : ముంబై ఇండియ‌న్స్ కు ఢిల్లీ బిగ్ షాక్

ప్ర‌తీకారం తీర్చుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్

DC vs MI WPL 2023 : ఉమెన్స్ ప్రిమీయ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్)లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ కు బ్రేక్ ప‌డింది. ఇప్ప‌టికే లీగ్ మ్యాచ్ లో భాగంగా ఒక‌సారి ముంబై చేతిలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చిత్తుగా ఓడి పోయింది. తాజాగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ స‌త్తా చాటింది.  దాంతో ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. 

ఒక ర‌కంగా ఇది కోలుకోలేని షాక్ . ఏక‌ప‌క్షంగా సాగింది మ్యాచ్. ముంబై ఇండియ‌న్స్ కు ఢిల్లీ క్యాపిట‌ల్స్(DC vs MI WPL 2023) చుక్క‌లు చూపించింది. 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ష‌ఫాలీ, అలిసే సెన్సేష‌న్ ఇన్నింగ్స్ తో దుమ్ము రేపారు. డ‌బ్ల్యూపీఎల్ టేబుల్ టాప‌ర్ పోరులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సెన్సేష‌న్ విక్ట‌రీని న‌మోదు చేసింది. 

ఓపెప‌ర్లు ష‌ఫాలీ వ‌ర్మ 33 ర‌న్స్ చేస్తే మేగ్ లానింగ్ 32 ప‌రుగులు , అలిసే క్యాప్సే 38 ర‌న్స్ తో అద‌ర‌గొట్టారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల మ్యాచ్ లో ఇంకా 11 ఓవ‌ర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ పూర్తి చేశారు ఢిల్లీ క్యాపిట‌ల్స్ . పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానంలో నిలిచింది. 

మెరుగైన ర‌న్ రేట్ తో ముంబై ఇండియ‌న్స్ ను వెన‌క్కి నెట్టి వేసింది. తొలి రౌండ్ లో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది. మార్చి 26తో తొలిసారిగా జ‌రిగిన మ‌హిళ‌ల లీగ్ మ్యాచ్ ముగియ‌నుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 109 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. 

ప‌వ‌ర్ ప్లేలో కీల‌క వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చిసింది మరిజానే. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ పుర‌స్కారం ద‌క్కింది. ఇక ముంబై మ్యాచ్ లో కెప్టెన్ కౌర్ 23 ర‌న్స్ చేస్తే వ‌స్త్రాక‌ర్ 26 ర‌న్స్ తో మెరిసింది. ఆఖ‌రులో వాంగ్ 23, కౌర్ 19 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నారు.

Also Read : యూపీ వారియ‌ర్స్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!