DC vs SRH IPL 2023 : ఢిల్లీ హైద‌రాబాద్ నువ్వా నేనా

ప్లే ఆఫ్ క‌ల‌గా మిగిలేనా

DC vs SRH IPL 2023 : మ‌రో కీల‌క మ్యాచ్ కు వేదిక కానుంది ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానం. ఐపీఎల్ లీగ్ 16వ సీజన్ లో శ‌నివారం రాత్రి 7.30 గంట‌ల‌కు జ‌రిగే మ్యాచ్ 40వ‌ది కావ‌డం విశేషం. ఇరు జ‌ట్ల‌కు ఈ లీగ్ మ్యాచ్ అత్యంత కీల‌కం. గ‌తంలో ఐపీఎల్ లో ఆసిస్ స్టార్ డేవిడ్ వార్న‌ర్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

అనుకోకుండా అత‌డిని త‌ప్పించింది యాజమాన్యం. ఐపీఎల్ వేలం పాట‌లో ఏ జ‌ట్టు అత‌డిని తీసుకునేందుకు ఇష్ట ప‌డ‌లేదు. కానీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ మాత్రం ఏరికోరి త‌క్కువ ధ‌ర‌కు తీసుకుంది. కానీ త‌న‌పై పెట్టిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు.

ఇదే స‌మ‌యంలో కీల‌క మార్పులు చేసినా స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టులో ఎలాంటి మార్పు రాలేదు. ఐడెన్ మార్క్రామ్ సార‌థ్యంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , వార్న‌ర్ నాయ‌క‌త్వంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇవాళ త‌ల‌ప‌డ‌నున్నాయి.

పాయింట్ల ప‌ట్టిక‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 7 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ ల‌లో ఓడి పోయి 2 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. 10వ స్థానంలో నిలిచింది. హైద‌రాబాద్ కూడా 7 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలై రెండింట్లో గెలుపొందింది. ఢిల్లీ కంటే మెరుగైన ర‌న్ రేట్ కార‌ణంగా 9వ స్థానంలో నిలిచింది.

Also Read : కోల్ క‌తా గుజ‌రాత్ బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!