Deepender Hooda : సీఎల్పీ లీడర్ గా, నూతన తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది ఏఐసీసీ హై కమాండ్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విస్తృతంగా చర్చించారు. అంతకు ముందు హైదరాబాద్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఏకగ్రీవంగా 64 మంది ఎన్నికైన అభ్యర్థులు తీర్మానం చేశారు.
Deepender Hooda Welcomed
ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా లోక్ సభకు వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని అందజేశారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిస సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా దీపిందర్ హూడా(Deepender Hooda) ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు. హూడా తల్లి ఆశాజీ రేవంత్ రెడ్డికి తిలకం దిద్దారు.
సీఎంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆమె పాదాలను తాకారు సీఎం. ఢిల్లీ నుండి కేబినెట్ కు సంబంధించిన జాబితాను తీసుకుని రాత్రికి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. భారీ భద్రత మధ్య నేరుగా ఎల్లా హోటల్ కు వెళ్లారు.
Also Read : Bose Raju : రేవంత్ కు బోస్ రాజు కంగ్రాట్స్
