Revanth Reddy Thackray : ఠాక్రేతో రేవంత్ ముచ్చ‌ట

కేబినెట్ కూర్పుపై చ‌ర్చ

Revanth Reddy Thackray : న్యూఢిల్లీ – ఓ వైపు సీఎంగా త‌న‌ను ఏఐసీసీ హై క‌మాండ్ ప్ర‌క‌టించ‌డంతో ఫుల్ ఖుష్ లో ఉన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయ‌న‌ను ఏక‌గ్రీవంగా ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత‌గా ఎన్నుకున్నారు. 48 గంట‌లు ఉత్కంఠ కొన‌సాగింది. ఎవ‌రిని ముఖ్య‌మంత్రి అభ్యర్థిగా ప్ర‌క‌టిస్తార‌నే దానిపై. దీనికంతంటికీ తెర దించే ప్ర‌య‌త్నం చేశారు ఏఐసీసీ పెద్ద‌లు.

Revanth Reddy Thackray Discussion

అంత‌కు ముందు పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు జ‌రిగింద‌ని బ‌య‌ట ప్ర‌చారం జ‌రిగినా సీఎం విష‌యం త‌ప్ప ఇంకే ప‌ద‌వి గురించైనా చ‌ర్చించాల‌ని పేర్కొంటూ స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పోయారు రాహుల్ గాంధీ. దీంతో నిన్న‌టి దాకా సీఎం పై ఆశ‌లు పెట్టుకున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ల‌కు నిరాశే ఎదురైంది.

ఇందులో ఎవ‌రో ఒక‌రికి డిప్యూటీ సీఎం, ఇత‌ర శాఖ‌లు కేటాయిస్తామ‌ని ఇందుకు ఒప్పు కోక త‌ప్ప‌ద‌ని సోనియా చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. ఇక కేబినెట్ కూర్పు విష‌యంపై ఢిల్లీలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) చ‌ర్చించారు. ఇందుకు సంబంధించి ఎవ‌రికి చోటు క‌ల్పిస్తార‌నే దానిపై టెన్ష‌న్ నెల‌కొంది పార్టీ శ్రేణులలో.

Also Read : Deepender Hooda : రేవంత్ కు గ్రాండ్ వెల్ క‌మ్

Leave A Reply

Your Email Id will not be published!