Deepika Mishra : వింగ్ కమాండర్ కు గ్యాలంట్రీ అవార్డు
తొలి మహిలా ఐఏఎఫ్ అధికారిణి
Deepika Mishra : వింగ్ కమాండర్ దీపికా మిశ్రా అరుదైన ఘనత సాధించారు. ఆమె ప్రతిష్టాత్మకమైన గ్యాలంట్రీ అవార్డును అందుకున్నారు. దేశంలో ఈ పురస్కారాన్ని పొందిన తొలి వింగ్ మహిళా కమాండర్ ఆమె కావడం విశేషం. రాజస్థాన్ కు చెందిన హెలికాప్టర్ పైలట్ వింగ్ కమాండర్ మిశ్రాకు వాయు సేన మెడల్ (శౌర్యం) లభించింది. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి దీపికా మిశ్రాకు(Deepika Mishra) యుద్ద సేవా పతకాన్ని అందజేశారు.
భారత వైమానిక దళంలో శౌర్య పురస్కారం అందుకున్న తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు. సుబ్రొతో పార్క్ లోని ఎయిర్ ఫోర్స్ ఆడిటోరియంలో జరగిన ఇన్వెస్టిచర్ వేడుకలో ఈ అవార్డును అందుకున్నారు దీపికా మిశ్రా. వైమానిక యోధులకు ఐఏఎఫ్ చీఫ్ పురస్కారాలు అందజేశారు.
వీరిలో ఇద్దరు ఐఏఎఫ్ అధికారులకు యుద్ద సేవా పతకాలు, 13 మంది అధికారులు, వైమానిక యోధులకు వాయు సేవా పతకం పొందారు. 30 మందికి విశిష్ట సేవా పతకాలు అందుకున్నారు. ఐఏఎఫ్ నుంచి 57 మంది , ఆర్మీ నుంచి ఒకరు మొత్తం 58 మంది ఈ విశిష్ట పురస్కారాలను దక్కించుకున్నారు. వింగ్ కమాడర్ మిశ్రా గురించి చీఫ్ మాట్లాడారు. ఐఏఎఫ్ చరిత్రలో గ్యాలంట్రీ అవార్డు పొందిన భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా ఆఫీసర్ అని పేర్కొన్నారు.
Also Read : విజయానికి దగ్గరి దారులు లేవు