Deepika Padukone Oscar : ఆస్కార్ వేదిక‌పై మెరిసిన దీపికా

ఆర్ఆర్ఆర్ సాంగ్ ప‌రిచ‌యం

Deepika Padukone Oscar : ఎదురు చూసిన ఉత్కంఠ‌కు తెర ప‌డింది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందింది. అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో 95వ ఆస్కార్ అకాడ‌మీ అవార్డ్ ప్ర‌దానోత్స‌వం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది.

మొత్తం 23 కేట‌గిరీల‌లో అవార్డుల‌ను ప్ర‌క‌టించింది ఆస్కార్ అకాడమీ అవార్డు క‌మిటీ. మొత్తం ప్ర‌క‌టించిన అవార్డుల‌లో 23 కేట‌గిరీల కింద పుర‌స్కారాలు విజేత‌ల‌కు ద‌క్కాయి. ఇందులో రెండు అవార్డులు భార‌త దేశానికి ద‌క్క‌డం విశేషం. ఇండియా నుంచి మూడు నామినేట్ కాగా రెండింటికి ద‌క్క‌డం విశేషం.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్ అవార్డు ద‌క్కింది నాటు నాటు సాంగ్ కు. దీనిని గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ రాస్తే ఎంఎం కీర‌వాణి స్వ‌ర ప‌రిచారు. రాహుల్ సిప్లిగంజ్ , కాల‌భైర‌వ పాడారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఈ వేడుక మొద‌ట‌గా నాటు నాటు సాంగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్రారంభ‌మైంది. దీనికంటే ముందు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే(Deepika Padukone) ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఆర్ఆర్ఆర్ చిత్రం దాని విశిష్ట‌త‌. తెలుగు సినిమాగా రూపు దిద్దుకుని ఎక్క‌డా త‌గ్గ‌కుండా అంత‌ర్జాతీయ స్థాయికి త‌గ్గ‌ట్టుగా నాటు నాటు సాంగ్ ను తీర్చిదిద్దారంటూ ప‌రిచ‌యం చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా మిలియ‌న్ల కొద్దీ జ‌నం వీక్షించార‌ని..ఇంకా చూస్తూనే ఉన్నార‌ని పేర్కొంది. అంతే కాదు థియేట‌ర్ల‌లో కూడా స్టెప్పులు వేస్తున్నారంటూ తెలిపింది. మొత్తంగా ప‌ఠాన్ తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న దీపికా ప‌దుకొణే (Deepika Padukone Oscar) ఇలా వైర‌ల్ కావ‌డం విశేషం క‌దూ.

Also Read : ఆస్కార్ అవార్డులు విజేత‌లు

Leave A Reply

Your Email Id will not be published!