Deepika Padukone : దీపికా ఏడాది సంపాదన రూ. 40 కోట్లు
ఆమె నికర విలువ రూ. 497 కోట్లు $60 మిలియన్లు
Deepika Padukone : దీపికా పదుకొనే ఆదాయంలో దూసుకు పోతున్నారు. బాలీవుడ్ లో అగ్ర నటీ నటుల సరసన చేరుతున్నారు. ఆమె గ్రాఫ్ ఇటీవల మరింత పెరిగింది. ఈ అమ్మడిది స్వస్థలం కర్ణాటక . ఆమె తండ్రి ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే. కొంత కాలం మానసికంగా ఇబ్బందికి గురైంది.
ఆ తర్వాత తేరుకుంది. ప్రస్తుతం అటు బాలీవుడ్ లో ఇటు హాలీవుడ్ లో బిజీగా మారింది. ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన సినిమా వివాదాస్పదం రేగినా చివరకు బాక్సాఫీసు బద్దలు కొట్టింది. ఇందులో దీపికా పదుకొనే(Deepika Padukone) రెచ్చి పోయి నటించింది. బికినీ డ్రెస్ కుర్రకారును మత్తెక్కించేలా చేసింది.
ఇక మోడల్ గా, నటిగా బాగానే సంపాదిస్తోంది. దీపికా పదుకొనే ఏడాదికి దాదాపు రూ. 40 కోట్లకు పైగానే ఆర్జిన్తున్నట్లు సమాచారం. ఇక ఆమె మొత్తం ఆస్తుల నికర విలువ రూ. 497 కోట్లు. అమెరికా డాలర్ల రూపంగా చూస్తే $60 మిలియన్లు. ఇక దీపికా పదుకొనే ఒక్కో చిత్రానికి తీసుకునే రెమ్యూనరేషన్ రూ. 15 కోట్లు, ఇక వివిధ వాణిజ్య సంస్థలకు సంబంధించిన ప్రకటనలు చేసేందుకు గాను రూ. 7 నుంచి 10 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. మొత్తంగా రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే ఇప్పుడు మోస్ట్ పాపులర్ నటిగా నిలిచింది.
Also Read : Smriti Irani Fire : హామీలపై నిలదీత స్మృతీ కన్నెర్ర