Delhi BJP Releases : ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో బీజేపీ లిస్టు రిలీజ్
232 మంది అభ్యర్థుల ప్రకటన..మహిళలకు పెద్ద పీట
Delhi BJP Releases : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి కంట్లో నలుసుగా మారింది అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ కొలువు తీరింది. ఇక్కడ కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు సీఎం కు మధ్య పొసగడం లేదు.
ఈ తరుణంలో గత కొన్నేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది కేంద్రం. ఎట్టకేలకు ఢిల్లీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంభంధించి ఆప్ ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను రెండు విడతులగా ప్రకటించింది.
సర్వే ఆధారంగా తమ కార్యకర్తలకు టికెట్లు కట్టబెట్టింది. ఈ తరుణంలో ఎలాగైనా సరే బల్దియాపై కాషాయ జెండా ఎగుర వేయాలని కంకణం కట్టుకుంది బీజేపీ. ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల లిస్టును సిద్దం చేసింది. ఆదివారం అధికారికంగా మొత్తం 250 స్థానాలకు గాను మొదటి విడత కింద 232 మంది అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేసింది.
ఇందుకు సంబంధించి ఇవాళ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఏకంగా 126 మంది మహిళలకు టికెట్లు కేటాయించింది బీజేపీ. ఇది ఊహించని నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో సైతం మహిళలకు పెద్ద పీట వేస్తామని బీజేపీ(Delhi BJP Releases) ప్రకటించింది. మొత్తంగా ఆప్ వర్సెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొనే చాన్స్ ఉంది.
మరో వైపు కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టనుంది ఈ ఎన్నికలపై.
Also Read : న్యాయ వ్యవస్థలో మహిళల స్థానం ఎక్కడ