DC vs MI ipl 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ఇవాళ ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్(DC vs MI ipl 2022) కు మరోసారి షాక్ తగిలింది. దుబాయి వేదికగా గత ఏడాది 2021లో జరిగిన ఐపీఎల్ లీగ్ లో ఊహించని రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి పోయింది.
తాజాగా మరోసారి ఓడించాలని అనుకున్న రోహిత్ సేనకు బిగ్ షాక్ ఇచ్చింది ఢిల్లీ. 178 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ త్వర త్వరగా వికెట్లు కోల్పోయింది.
72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇక్కట్ల పాలైన స్థితిలో లలిత్ యాదవ్ అడ్డు గోడలా నిలబడ్డాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఏకంగా 17 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు.
మ్యాచ్ పరంగా చూస్తే అంతా పటేల్ అనుకుంటారు కానీ ఈ విజయంలో కనిపించని ఆటగాడు మాత్రం లలిత్ యాదవ్ అని చెప్పక తప్పదు. కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు.
ఈ దశలో ఓ వైపు వికెట్లు కూలుతున్నా ఎక్కడా తొట్రుపాటు పడలేదు లలిత్ యాదవ్. 38 బంతులు ఆడిన యాదవ్ 4 ఫోర్లు 2 సిక్సర్లతో 48 రన్స్ చేశాడు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన అక్షర్ పటేల్ ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు.
ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. బాదడం మొదలు పెట్టాడు. దీంతో తమదని అనుకున్న మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోకి వెళ్లింది.
ఇదిలా ఉండగా గతంలో విమర్శించిన అభిమానులే ఇప్పుడు లలిత్ యాదవ్ ఆట తీరును మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.
Also Read : చెలరేగిన కిషన్ ముంబై బిగ్ స్కోర్