DC Issues Code Of Conduct : ఢిల్లీ క్రికెటర్ అసభ్య ప్రవర్తన
కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాల్సిందే
DC Issues Code Of Conduct : ఐపీఎల్ 16వ సీజన్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఓ పార్టీలో మహిళ పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన ఓ క్రికెటర్ అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే డీసీ మేనేజ్మెంట్ రంగంలోకి దిగింది. ఎవరైనా సరే ఆటగాళ్లు కానీ, హెడ్ కోచ్ లు, ఇతర సభ్యులు కోడ్ ఆఫ్ కండక్ట్ ను పాటించాల్సిందేనంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం కలకలం రేపింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పార్టీ సందర్బంగా సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో కోడ్ ఆఫ్ కండక్ట్ ను(DC Issues Code Of Conduct) అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల మ్యాచ్ ఫీజులో కోతతో పాటు నిషేధానికి కూడా గురవుతాడు. ఇప్పటికే ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్ ఆధారంగా ఐదుగురు కెప్టెన్లపై వేటు పడింది. మరో వైపు మైదానంలో దురుసు ప్రవర్తన కారణంగా విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించింది.
తాజాగా ఢిల్లీ క్రికెటర్ నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది యాజమాన్యం. ఎవరైనా సరే రూల్స్ ను పాటించాల్సిందేనంటూ పేర్కొంది. కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇవాల్టి నుంచే అమలు లోకి వస్తుందని వెల్లడించింది. క్రికెటర్లు ఎవరైనా సరే రాత్రి 10 గంటల తర్వాత పరిచయస్తులను వారి గదులలోకి తీసుకు రావద్దని ఆదేశించింది.
Also Read : ధోనీ సంజూ శాంసన్ వైరల్