Delhi Police Case : బ్రిజ్ భూషణ్ సింగ్ పై కేసు నమోదు
సుప్రీంకోర్టుకు ఢిల్లీ పోలీస్ వెల్లడి
Delhi Police Case : సుప్రీంకోర్టు దెబ్బకు దిగి వచ్చారు ఢిల్లీ పోలీసులు. రెజ్లింగ్ ఫెడరేషన్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు 9 మంది మహిళా రెజ్లర్లు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ వాపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరు ఆందోళనకు దిగారు. దీంతో కేంద్రం దిగి వచ్చింది. కమిటీని ఏర్పాటు చేసింది. ఈనికి మేరి కోమ్ చైర్మన్ గా ఉన్నారు. కమిటీ నివేదిక పూర్తిగా బ్రిజ్ భూషణ్ కు అనుకూలంగా ఉందంటూ మరోసారి నిరసనకు దిగారు మహిళా రెజ్లర్లు.
జంతర్ మంతర్ వద్ద మరోసారి ఆందోళనకు దిగడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా ఢిల్లీ పోలీసులు కేసు(Delhi Police Case) నమోదు చేయలేదు. దీనిపై బాధిత రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. దీంతో దెబ్బకు దిగి వచ్చారు పోలీసులు. ఇవాళ కోర్టుకు తెలియ చేశారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా సీజేఐ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం సీరియస్ కామెంట్స్ చేసింది. అంతర్జాతీయ క్రీడలలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన రెజ్లర్లు లైంగిక వేధింపుల గురించి పిటిషన్ లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. తాను నిర్దోషినంటూ బ్రిజ్ భూషణ్ తెలిపారు.
Also Read : పాటిల్ యత్నాల్ ను సస్పెండ్ చేయాలి