Devon Conway : డెవాన్ కాన్వే అరుదైన రికార్డ్

వ‌రుస‌గా 5వ హాఫ్ సెంచ‌రీ

Devon Conway : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 200 ర‌న్స్ చేసింది.

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే(Devon Conway) మ‌రోసారి రెచ్చి పోయాడు. 16 ఫోర్లు 1 సిక్స‌ర్ తో ఏకంగా 92 ర‌న్స్ చేశాడు..చివ‌రి దాకా నిలిచాడు. ఐపీఎల్ లో వ‌రుస‌గా ఇది 5వ హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు కాన్వే. టి20 మ్యాచ్ ల్లో ఓ ప్ర‌త్యేక మైలు రాయిని చేరుకున్నాడు.

టీ20 పొట్టి ఫార్మాట్ లో వేగంగా 5000 ర‌న్స్ చేసిన ఆట‌గాళ్ల జాబితాలో డేవాన్ కాన్వే పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ ను అధిగ‌మించాడు. ఇక విండీస్ స్టార్ క్రికెట‌ర్ క్రిస్ గేగ‌ల్ కేవ‌లం 132 ఇన్నింగ్స్ ల‌లో 5000 ప‌రుగుల మార్క్ ను చేరుకోవ‌డం ద్వారా జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు.

ఇక డెవాన్ కాన్వే(Devon Conway) 144 ఇన్సింగ్స్ ల‌లో షాన్ మార్ష్ తో ఈ ఫీట్ ను సాధించిన మూడో అత్యంత వేగ‌వంత‌మైన క్రికెట‌ర్ గా నిలిచాడు. వేగంగా 5000 ర‌న్స్ చేసిన ఆట‌గాళ్ల‌లో క్రిస్ గేల్ , కేఎల్ రాహుల్ , డెవాన్ కాన్వే , షాన్ మార్ష్ , బాబ‌ర్ ఆజ‌మ్ ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా జోరు మీదున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ కు పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చుక్క‌లు చూపించింది. 4 వికెట్ల తేడాతో విజ‌యం న‌మోదు చేసింది.

Also Read : ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ షాన్ దార్

Leave A Reply

Your Email Id will not be published!