Dharmapuri Aravind : ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్
కేసీర్ సచ్చిపోతే రూ. 5 లక్షలు ఇస్తాం
Dharmapuri Aravind : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కల్వకుంట్ల కుటుంబంపై నిప్పులు చెరిగారు. ఏకంగా బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ సచ్చిపోతే రూ. 5 లక్షలు , కేటీఆర్ సస్తే రూ. 10 లక్షలు, కవిత చని పోతే రూ. 20 లక్షలు ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామంటూ ప్రకటించారు.
Dharmapuri Aravind Slams KCR Family
బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడిని రాజేసింది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.
ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని, బీఆర్ఎస్ బాస్ కు షాక్ ఇవ్వాలని, అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మాటల తీవ్రత మరింత పెరిగింది.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎవరైనా కుటుంబంలో చని పోతే రూ. 5 లక్షలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీనికి కౌంటర్ గా ధర్మపురి అరవింద్(Dharmapuri Aravind) ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Minister KTR : ఎన్నారైలు మద్దతు ఇవ్వండి – కేటీఆర్