Minister KTR : ఎన్నారైలు మ‌ద్ద‌తు ఇవ్వండి – కేటీఆర్

పిలుపునిచ్చిన ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి

Minister KTR  : హైద‌రాబాద్ – ప్ర‌వాస భార‌తీయులు, తెలుగు వారు బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు ఐటీ, ,పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. ఉద్య‌మ కాలంలో కీల‌క పాత్ర పోషించార‌ని, సీఎం కేసీఆర్ కు వెన్నుద‌న్నుగా నిలిచార‌ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు.

Minister KTR Asking for the support of NRIs

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ ఎన్నారై ఫోరం చీఫ్ మ‌హేష్ బిగాల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడారు. అనేక సంద‌ర్భాల‌లో మీ అంద‌రూ స‌హ‌క‌రించార‌ని, ఇదే తోడ్పాటు ఇప్పుడు కూడా ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళుతున్న కేసిఆర్ గారి నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని తమ తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.

జీవితంలో ఉన్నత చదువులు చదివి, వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు అంటే గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, ఇలాంటి ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఇక్కడి ఓటర్లు వింటారని కేటీఆర్(Minister KTR) అన్నారు.

రానున్న 30 రోజులు తెలంగాణ రాష్ట్రానికి సైతం అత్యంత కీలకమని, ఒకప్పుడు కాంగ్రెస్ వలన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి 60 సంవత్సరాలు అనేక బాధలకు గురైందన్నారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధి వెనక్కి పోతుందని మంత్రి హెచ్చ‌రించారు.

Also Read : Yerrashekar : గులాబీ గూటికి ఎర్ర‌శేఖ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!