Yerrashekar : గులాబీ గూటికి ఎర్ర‌శేఖ‌ర్

కేసీఆర్ తో మ‌ర్యాద పూర్వ‌క భేటీ

Yerrashekar : హైద‌రాబాద్ – ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన జ‌డ్చ‌ర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర‌శేఖ‌ర్ అలియాస్ మ‌రాఠి చంద్ర‌శేఖ‌ర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయ‌న మంత్రి కేటీఆర్ ను క‌లుసుకున్నారు. అనంత‌రం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

Yerrashekar Joined in BRS Party

ఈ సంద‌ర్భంగాను తాను భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ (బీఆర్ఎస్) లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న‌కు , కేసీఆర్ కు మ‌ధ్య 20 ఏళ్ల అనుబంధం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో కేసీఆర్, ఎర్ర‌శేఖ‌ర్ తెలుగుదేశం పార్టీలో కొన‌సాగారు. ఆయ‌న డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న స‌మ‌యంలో జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆ త‌ర్వాత టీడీపీ జిల్లా అధ్య‌క్షునిగా ప‌ని చేశారు. బీజేపీలో చేరి జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. అనంత‌రం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. చివ‌రి దాకా జ‌డ్చ‌ర్ల‌, నారాయ‌ణ‌పేట సీటు వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ మోసం చేయ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న అనుచ‌రుల‌తో క‌లిసి రెబ‌ల్ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు ఎర్ర‌శేఖ‌ర్.

నారాయ‌ణ‌పేట ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి ఎర్ర‌శేఖ‌ర్(Yerrashekar) ను బీఆర్ఎస్ లో చేరేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. విచిత్రం ఏమిటంటే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్, నిరంజ‌న్ రెడ్డి, ల‌క్ష్మా రెడ్డి లేక పోవ‌డం విశేషం.

Also Read : Nagam Janardhan Reddy : బీఆర్ఎస్ గూటికి నాగం

Leave A Reply

Your Email Id will not be published!