#MilkBanks : ఆక‌లి తీరుస్తున్న అమ్మ పాల బ్యాంక్‌లు

పిల్ల‌ల పాలిట దైవాలు పాల బ్యాంకులు

Milk Banks: అప్పుడే పుట్టిన పిల్లలకు సరిపడా పాలు ఇవ్వక పోవడం వల్ల ఎంతో మంది మృత్యువాతకు లోనవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆసుపత్రులు ప్రత్యేకంగా తల్లులకు సంబంధించిన అమ్మ పాల బ్యాంకులను ఏర్పాటు చేశారు. దీని వల్ల పాలు రాని లేదా తక్కువ పాలు కలిగిన తల్లుల పిల్లలకు ఈ పాల బ్యాంకుల వల్ల ఎంతో మేలు చేకూరుతోంది.

రోగులకు అత్యవసర సమయంలో రక్తం ఎలా ఉపయోగ పడుతుందో,  ఈ పాల బ్యాంకులు పిల్లలను కాపాడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో తల్లులు ఎక్కువ మంది పాల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. దీని తీవ్రతను గమనించిన, నగరంలో పేరున్న నీలోఫర్ హాస్పిటల్ లో మొదటి సారిగా అమ్మ పాల బ్యాంక్(Milk Banks) ను ప్రారంభించారు.

పాలను సేకరించడం, వాటిని శుద్ధి చేయడం, భద్రంగా భద్ర పర్చడం చేస్తారు. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందితో పాటు స్పెషల్ డాక్టర్స్ కూడా ఈ బ్యాంక్ లో పని చేస్తున్నారు. కొందరు పురిట్లోనే పిల్లలు చని పోతుండగా, మరికొందరు తల్లులు మృత్యు వాతకు గురవుతున్నారు. ఈ సమయంలో పిల్లల సంరక్షణ భాద్యతను ఈ ఆస్పత్రి నిర్వాహకులు చూసుకుంటున్నారు.

దీనికి ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు. ధాత్రి అనే స్వచ్చంద సంస్థ ఈ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలకు పాలు పట్టడం కూడా సిబ్బందే దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రాణాలు పోకుండా చిన్నారుల ఆకలి తీరుస్తున్నారు. ఎంతో మంది పిల్లలకు పాలు దొరకడం లేదు. ఈ కొత్త ప్రపంచం లోకి వచ్చే చిన్నారులకు తప్పనిసరిగా పాలు అవసరమవుతాయి.

ఇది హైదరాబాద్ లో ఎక్కువగా అవసరమవుతోంది. ఈ సమస్యను గుర్తించి, పరిష్కారం కోసమే 2017లో మదర్ మిల్క్ బ్యాంక్(Milk Banks) ఏర్పాటు చేయడం జరిగిందని అంటున్నారు బాద్యులు. ఒకటిన్నర కేజీలోపు బరువుతో పుట్టిన పిల్లలకు, తల్లి మరెక్కడో ఉండి ఇక్కడి ఐసీయూలో చేర్చిన పిల్లలకు, అనాథ పిల్లలకు డాక్టర్ సూచన మేరకు సేకరించిన తల్లిపాలను అందిస్తారు.

ధాత్రి తో పాటు హైదరాబాద్ లోని మరో హాస్పిటల్ రెయిన్ బో కూడా అమ్మ పాల బ్యాంక్(Milk Banks) ను ఏర్పాటు చేసింది. దీనిని టెన్నిస్ తార సానియా మీర్జా ప్రారంభించారు. తమ బ్యాంక్ ఆసక్తి ఉన్న వారి నుండి పాలు సేకరిస్తుంది. అవసరంలో ఉన్న వారికి ఇస్తుందంటున్నారు ధాత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్. మొత్తం మీద ప్రాణం పోస్తున్న తల్లులతో పాటు పాల కొరత తీరుస్తున్న ఇలాంటి పాల సేకరణ బ్యాంకులు రావాల్సిన అవసరం ఎంతో ఉంది కదూ.

No comment allowed please