Dilip Vengsarkar : ద్రవిడ్..రోహిత్ పై వెంగ్ సర్కార్ ఫైర్
ఏమిటీ ప్రయోగాలు ఎందుకీ నిర్ణయాలు
Dilip Vengsarkar : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ -2022(Asiacup – 2022) తుది అంకానికి చేరుకుంది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్ కు చేరుకున్నాయి.
టైటిల్ ఫేవరేట్ గా పేరొందిన టీమిండియా లంక చేతిలో ఓటమి పాలై ఆఫ్గాన్ తో గెలిచి ఇంటి బాట పట్టింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ఉన్నట్టుండి జూలు విదిల్చింది.
అండర్ డాగ్స్ గా ట్రీట్ చేసిన పాకిస్తాన్, భారత్, ఆఫ్గనిస్తాన్ లకు చుక్కలు చూపించింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. ప్రధానంగా కీలక పోరులో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించింది.
కళ్లు చెదిరే బౌలింగ్ తో ఆకట్టుకుంది. ఇది పక్కన పెడితే భారత జట్టు గత ఏడాది నుంచి ఏడు కెప్టెన్లను మార్చింది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలు, ఎంపిక చేస్తున్న ఆటగాళ్లను చూసి ఇతర జట్లు నవ్వుకుంటున్నాయి.
ద్రవిడ్ హెడ్ కోచ్(Rahul Dravid) గా నియమించినా జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ప్రధానంగగా సమన్వయం లోపించిందని నిప్పులు చెరిగాడు భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్(Dilip Vengsarkar).
బారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఎందుకని చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మండిపడ్డాడు. ఆడే ఆటగాళ్లను ఎందుకు పక్కన పెట్టారంటూ ప్రశ్నించాడు.
అసలు జట్టులో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా అని నిలదీశాడు వెంగ్ సర్కార్. సీరీస్ లో ప్రయోగాలు చేస్తే ఓకే విచిత్రం ఏమిటంటే మెగా టోర్నీలలో కూడా ప్రయోగాలు చేస్తారా అంటూ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్(Rohit Sharma) ను ఏకి పారేశాడు.
Also Read : బాబర్ ఆజంపై సల్మాన్ భట్ కన్నెర్ర